
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 124


తారక్ అన్నని ఇలా చూసి 6 ఏళ్ళు అయ్యింది

కేరళ బాధితులకు సూర్య, కార్తి భారీ విరాళం

డైరెక్టర్ బాబి బర్త్ డే- టీమ్ 109 స్పెషల్ విషెస్

35 నుండి ప్రియదర్శి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

దేవర షూటింగ్ అంటే ఇష్టం

రాజ్ తరుణ్ ప్రాణం పెట్టి చేశాడు

100 కోట్లకు చేరువలో రాయన్

VD 12 శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్

డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మురారి రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అప్ డేట్
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మేకర్స్ వాటిని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇక రీ-రిలీజ్‍లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రెండు చేరాయి. ఆయన హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్స్ ‘ఒక్కడు’ మరియు 'మురారి' త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాయి.

భారతీయుడు2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?
కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇండియన్2. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఈసినిమా పై మొదటినుండీ భారీ అంచనాల ఏర్పడ్డాయి. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటించగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ నిర్మించిన ఈసినిమాకు.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన TFCC కొత్త అధ్యక్షుడు
తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆయన TFCCకి కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో భరత్ భూషణ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఆయన సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలు మరియు గద్దర్ అవార్డ్స్ గురించి చర్చించారు.

మిస్టర్ బచ్చన్ నుండి జిక్కీ సాంగ్ ప్రోమో రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా మిస్టర్ బచ్చన్. ఈసినిమాపై మొదటినుండే భారీ అంచనలే ఉన్నాయి. ఇక ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే షోరీల్, టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

తారక్ అన్నని ఇలా చూసి 6 ఏళ్ళు అయ్యింది
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

కేరళ బాధితులకు సూర్య, కార్తి భారీ విరాళం
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. అక్కడ భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఘటనలో మృతుల సంఖ్య 250కిపైగా చేరినట్టు తెలుస్తుంది. అంతేకాదు కొండచరియల క్రింద ఇంకా చాలా మృతదేహాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవాపు ఆర్మీ, వైమానిక దళం, నేవీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక దళం, స్థానికులకు చెందిన రెస్క్యూ టీమ్‌లు ఇప్పటికే సహాయక చర్యలు అందిస్తున్నారు.

డైరెక్టర్ బాబి బర్త్ డే- టీమ్ 109 స్పెషల్ విషెస్
బాలకృష్ణ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ టైటిల్ ను అయితే ఫిక్స్ చేయలేదు కానీ ఎన్బీకే 109 అనే టైటిల్ తోనే సినిమా షూటింగ్ ను చేస్తున్నారు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక నేడు డైరెక్టర్ బాబి తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈనేపథ్యంలో సినీ సెలబ్రిటీల నుండి బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ఇక ఇప్పుడు ఎన్బీకే 109 టీమ్ కూడా స్పెషల్ విషెస్ ను అందించారు. ఈ సందర్భంగా బాబి కి సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశారు.

శివం భజే.. తెలుగు రివ్యూ
ఇక మొత్తంగా చూస్తే, భారీ అంచనాల మధ్య వచ్చిన శివం భజే అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. అశ్విన్ బాబు యాక్టింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ బాగా హైలైట్ అయ్యాయి. కథ అక్కడక్కడా ఫ్లాట్‌గా సాగినా అశ్విన్ తన నటనతో ఆ లోటు తెలియనివ్వకుండా చేసాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు డివైన్ పాయింట్‍తో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. అన్ని ఎలెమెంట్స్ సరిగా కుదిరాయి. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళను అలరించేలా ఉంది. సో.. శివం భజే సినిమాతో హీరో అశ్విన్ బాబు ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడినట్టే.

35 నుండి ప్రియదర్శి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
కెరీర్ మొదటినుండీ విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. ఇక గత కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న నివేదా ఇప్పుడు మరో సినిమాతో వస్తుంది. నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో నివేధా థామస్ పాత్రలో వస్తున్న సినిమా 35-చిన్న కథ కాదు. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో నివేదా థామస్ ఓ మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపిస్తోంది.

బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ ఇన్విటేషన్ చూసారా?
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అలనాటి తెలుగు చలనచిత్ర అగ్ర నటుడు, దివంగత నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 వసంతాలు పూర్తిచేసుకోబోతున్నారు. తొలిసారి ఆయన నటించిన 'తాతమ్మ కల' సినిమా 1974 ఆగస్టు 30న విడుదలైంది. ఇందులో బాలకృష్ణ బాలనటుడిగా కనిపించారు. ఈ క్రమంలో ఈనెల 30వ తేదీతో ఆయన నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలు కావోస్తోంది.

మెడికో థ్రిల్లర్ లో అశ్విన్ బాబు-స్పెషల్ పోస్టర్ రిలీజ్
సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు అశ్విన్ బాబు. ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న శివం భజే సినిమా ఫైనల్ గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్సర్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గంగ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాకు వికాస్ బడిస సంగీతం, దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫి అందించారు.

అనన్య నాగళ్ల బర్త్ డే.. పొట్టేల్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
మల్లేశం, వకీల్ సాబ్, శాకుంతలం తదితర చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. తాజాగా ఆమె యంగ్ హీరో యువ చంద్ర కృష్ణతో కలిసి 'పొట్టేల్' సినిమాలో నటిస్తోంది. ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ మూవీగా రూపొందుతోంది. కంప్లీట్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

దేవర షూటింగ్ అంటే ఇష్టం
ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఈసినిమా దేవర. పోర్ట్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈసినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. అయితే రిలీజ్ కు ఇంకా రెండు నెలలు టైమ్ ఉండగా ఇప్పటినుండే సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేయడానికి చూస్తున్నారు మేకర్స్.

రాజ్ తరుణ్ ప్రాణం పెట్టి చేశాడు
యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. మాల్వి మల్హోత్రా కథానాయికగా ననటించగా.. మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

తిరగబడరసామీ.. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఎంటర్‌టైనర్
యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. మాల్వి మల్హోత్రా కథానాయికగా ననటించగా.. మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

100 కోట్లకు చేరువలో రాయన్
తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ నుండి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ మాత్రమే కాదు తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. దానికి కారణం తను చేసే సినిమాల్లో కంటెంట్ ఉంటుందనే అభిప్రాయం ఉండటం వల్లే. బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా కాస్త సినిమా చూసే విధంగా ఉంటుందన్న నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని ధనుష్ కూడా ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. రీసెంట్ గా రాయన్ తో ఆ విషయం మరోసారి రుజవైంది.

మిస్టర్ బచ్చన్ ను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్న భాగ్యశ్రీ
మూవీ ప్రమోషన్స్ అంటే మాములుగా హీరోయిన్స్ వెనకడువేస్తారు.అంత యాక్టీవ్ గా ప్రమోట్ చేయరు కానీ మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాత్రం మిగితా టీం ఎంత కష్టపడుతున్నారో అంతకన్నా ఎక్కువగానే ప్రమోట్ చేస్తుంది.ప్రెస్ మీట్ లకు రావడం,ఇంస్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ లతో రీల్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెలుతుంది. ఈ సినిమాకు హైప్ రావడం లో భాగ్యశ్రీ కూడా ఓకారణం.తన గ్లామర్ కు యూత్ ఫిదా అవుతున్నారు.ఇది తనకు తెలుగులో మొదటి సినిమా.

రామయ్యా వస్తావయ్యా అందుకే ప్లాప్ అయ్యింది -హరీష్ శంకర్
డైరెక్టర్ హరీష్ శంకర్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రామయ్యా వస్తావయ్యా.ఎన్టీఆర్ కితోడు అప్పటికీ మిరపకాయ్,గబ్బర్ సింగ్ లతో హరీష్ ఫీక్ సక్సెస్ చూడడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే రామయ్యా వస్తావయ్యా ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.దానికి కారణం ఏంటో రీసెంట్ ఇంటర్వ్యూ లో చెప్పేశాడు హరీష్ శంకర్.

VD 12 శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన 12వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.ఇక త్వరలోనే ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నారు.షూటింగ్ విషయానికి వస్తే నిన్నటితో ఈసినిమా శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఈ లాంగ్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.సినిమాలో ఈ సీన్స్ హైలైట్ అవ్వనున్నాయట. ఈ షెడ్యూల్ తో 60శాతం షూటింగ్ పూర్తయింది.

డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ హీరో నుండి వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇక రామ్ కు హిట్ దక్కి చాలా కాలమే అయిపోయింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని వస్తున్నాడు. అయితే ఈసారి వచ్చేది డబుల్ ఇస్మార్ట్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటంతోపాటు హిట్ పడే అవకాశమే ఉందంటున్నారు. ఎందుకంటే ఈసినిమా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా రావడమే. మరోవైపు ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.