బాలకృష్ణ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ టైటిల్ ను అయితే ఫిక్స్ చేయలేదు కానీ ఎన్బీకే 109 అనే టైటిల్ తోనే సినిమా షూటింగ్ ను చేస్తున్నారు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక నేడు డైరెక్టర్ బాబి తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈనేపథ్యంలో సినీ సెలబ్రిటీల నుండి బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ఇక ఇప్పుడు ఎన్బీకే 109 టీమ్ కూడా స్పెషల్ విషెస్ ను అందించారు. ఈ సందర్భంగా బాబి కి సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు పలు పోస్టర్లు, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. మాన్‌స్టర్ వచ్చేశాడు.. దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది. జాలి.. దయ కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ వచ్చిన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
కాగా ఈసినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. ఊర్వశి రౌతేలా కూడా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: