తిరగబడరసామీ.. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఎంటర్‌టైనర్

Tiragabadara Saami Complete Family Entertainer, Says Hero Raj Tarun

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా ననటించగా.. మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యూత్‌ని ఆకట్టుకునే రోమాన్స్‌తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్‌ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై క్యురియాసిటీని పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా షో రీల్‌ని స్క్రీన్ చేశారు.

ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‍లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. “ఈ ఈవెంట్‍కి విచ్చేసిన అందరికీ థాంక్ యూ. మా దర్శకుడు రవికుమార్ చౌదరి గారు తిరగబడరసామీ కథ చెప్పగానే విపరీతంగా నచ్చి వెంటనే చేస్తానని చెప్పాను. ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. గొప్పగా హ్యాండిల్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్ అన్నీ వున్న సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ మంచి ఎంటర్‌టైనర్” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మా నిర్మాత శివకుమార్ గారు ప్రాణం పెట్టి చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్. మాల్వీ మల్హోత్ర చాలా మంచి యాక్టర్. ఇది ఆమె తొలి తెలుగు సినిమా. ఆమెను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సినిమా కోసం అందరం కష్టపడ్డాం. కానీ మా కెమరామెన్ జవహర్ రెడ్డి గారు మా అందరి కంటే ఎక్కువ కష్టపడ్డారు. మా సినిమాని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.