మల్లేశం, వకీల్ సాబ్, శాకుంతలం తదితర చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. తాజాగా ఆమె యంగ్ హీరో యువ చంద్ర కృష్ణతో కలిసి ‘పొట్టేల్’ సినిమాలో నటిస్తోంది. ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ మూవీగా రూపొందుతోంది. కంప్లీట్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీలో ప్రముఖ నటుడు అజయ్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ టెర్రిఫిక్‌గా ఉండబోతోంది. అలాగే ఈ సినిమాలో ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు ఇతర నటీనటులు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇందులోని 4 పాటలను రిలీజ్ చేయగా.. అవి చార్ట్ బస్టర్ హిట్స్‌గా అలరిస్తున్నాయి.
ఇక ఇదిలావుంటే, హీరోయిన్ అనన్య నాగళ్ల గురువారం జన్మదినం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో అనన్య రూరల్ ట్రెడిషనల్ లుక్‌లో చాలా నేచురల్‌గా కనిపించింది. ఇందులో పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ వున్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్టు అర్ధమవుతోంది. బుజ్జమ్మగా అనన్య క్యారెక్టర్ ఎక్స్ ట్రార్డినరీగా వుండబోతోందని మేకర్స్ తెలిపారు.
కాగా ఈ పొట్టెల్ చిత్రాన్ని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తుండగా.. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: