యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా ననటించగా.. మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూత్ ని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై క్యురియాసిటీని పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా షో రీల్ ని స్క్రీన్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. “చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాను. చాలా రోజుల తర్వాత నాకు దర్శకత్వం అవకాశం ఇచ్చిన నిర్మాత శివకుమార్ గారికి థాంక్స్. ఆయన చాలా మంచి లోకేషన్స్, యాక్టర్స్ ఇచ్చారు. జవహర్ రెడ్డి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. రాజ్ తరుణ్ ప్రాణం పెట్టి చేశాడు. ఈ క్యారెక్టర్ ని చాలా బ్యాలెన్స్ గా చేశారు. మాల్వి తెలుగమ్మాయిలానే వుంటుంది. చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్” అని చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: