మిస్టర్ బచ్చన్ ను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్న భాగ్యశ్రీ

Bhagyashri Borse Promotes Mr Bachchan aggressively

మూవీ ప్రమోషన్స్ అంటే మాములుగా హీరోయిన్స్ వెనకడువేస్తారు.అంత యాక్టీవ్ గా ప్రమోట్ చేయరు కానీ మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాత్రం మిగితా టీం ఎంత కష్టపడుతున్నారో అంతకన్నా ఎక్కువగానే ప్రమోట్ చేస్తుంది.ప్రెస్ మీట్ లకు రావడం,ఇంస్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ లతో రీల్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెలుతుంది. ఈ సినిమాకు హైప్ రావడం లో భాగ్యశ్రీ కూడా ఓకారణం.తన గ్లామర్ కు యూత్ ఫిదా అవుతున్నారు.ఇది తనకు తెలుగులో మొదటి సినిమా. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పుకుంది.మొత్తానికి మొదటి సినిమాతోనే గట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది.ఇప్పటికే చేతిలో రెండు,మూడు ఆఫర్లు కూడా వున్నాయట.అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సివుంది.ఇక మిస్టర్ బచ్చన్ రిలీజ్ తరువాత తన పేరు మోగిపోవడం ఖాయం. 

మిస్టర్ బచ్చన్ ను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా రవితేజ టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు.ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే అంతకన్నా ముందుగానే 14న పెయిడ్ ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.ఇక ఈఏడాది రవితేజ కు ఇది సెకండ్ రిలీజ్.ఫిబ్రవరి లో ఈగల్ తో వచ్చాడు.మరి ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.