దేవర షూటింగ్ అంటే ఇష్టం

janhvi kapoor interesting update on devara shooting

ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఈసినిమా దేవర. పోర్ట్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈసినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. అయితే రిలీజ్ కు ఇంకా రెండు నెలలు టైమ్ ఉండగా ఇప్పటినుండే సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేయడానికి చూస్తున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చింది జాన్వీ కపూర్. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ జరుగుతుండగా జాన్వీ కపూర్ ఈ షూటింగ్ లో పాల్గొంది. ఈనేపథ్యంలో జాన్వీ కోసం స్పెషల్ గా చాలా రకాల ఐటమ్స్ ఫుడ్ తెప్పించారు. ఆ ఫుడ్ అంతా టేబుల్ మీద పెట్టగా జాన్వీ ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. దేవర షూటింగ్ అంటే నాకు ఇష్టం అని తెలిపింది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌ అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈమధ్య రిలీజ్ అయిన మొదటి పాట సెన్సేషనల్‌ హిట్‌ అయింది. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది సెకండ్ సాంగ్ గురించి. సెకండ్ సాంగ్ గురించి ఇప్పటికే హింట్ కూడా వచ్చేసింది. త్వరలోనే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలోని రెండో పాట మెలోడీగా సాగే డ్యూయెట్‌ అని తెలుస్తోంది.

కాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.