కెరీర్ మొదటినుండీ విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. ఇక గత కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న నివేదా ఇప్పుడు మరో సినిమాతో వస్తుంది. నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో నివేధా థామస్ పాత్రలో వస్తున్న సినిమా 35-చిన్న కథ కాదు. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో నివేదా థామస్ ఓ మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో నటిస్తున్న కీలక పాత్రలకు సంబంధించి ఒక్కొక్కరి స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే నివేదా థామస్, విశ్వదేవ్, చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ శర్మ పాత్రలను పరిచయం చేస్తూ 35 సెకన్ల వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో పాత్రకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఈసినిమాలో ప్రియదర్శి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈనేపథ్యంలో తాజాగా ప్రియదర్శికి చెందిన 35 సెకన్ల గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. చాణక్య వర్మ లెక్కల మాస్టర్ పాత్రలో ప్రియదర్శి కనిపించనున్నాడు.
కాగా సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఆగష్ట్ 15వ తేదీన తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈసినిమా ఒకేసారి విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































