నటీనటులు: అశ్విన్ బాబు, అర్బాజ్ ఖాన్, దిగంగన సూర్యవంశీ
సంగీతం: వికాస్ బడిస
సినిమాటోగ్రఫీ: శివేంద్ర
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
దర్శకత్వం: అప్సర్
నిర్మాణం: గంగా ఎంటర్టైన్మెంట్స్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శివం భజే’. యంగ్ డైరెక్టర్ అప్సర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ప్రతినాయకుడిగా కీలక పాత్రలో కనిపించాడు. గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై మార్కెట్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో శివం భజే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మరి ఇంత హైప్ మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కథ:
పాకిస్తాన్, చైనా దేశాలు ఇండియాపై వాక్సిన్ ద్వారా బయో వార్ సృష్టించడానికి కుట్ర చేస్తుంటాయి. మన కథానాయకుడైన చందు (అశ్విన్ బాబు) ఒక లోన్ రికవరీ ఎజెంట్. బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుని తిరిగి చెల్లించకుండా తప్పించుకుని తిరిగే వాళ్ళ దగ్గర నుంచి వసూళ్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ కెమికల్ ల్యాబ్‌లో పనిచేసే శైలజ (దిగంగనా సూర్యవంశీ)ని చూసి ప్రేమలో పడతాడు. ఇదిలా సాగుతుండగా ఒక గొడవలో అనుకోకుండా చందుకి కళ్ళు పోతాయి.
పరమ శివుడి అనుగ్రహంతో అనూహ్య సంఘటనల మధ్య చందు కళ్లకు ఆపరేషన్ జరుగుతుంది. అయితే కొత్త కళ్ళు వచ్చాక చందుకి వివిధ రకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటి? అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపించే విజువల్స్‌కి అర్ధం ఏమిటి? ఈ దారుణాల వెనుక ఎవరున్నారు? మన శత్రు దేశాలకు సాయం చేస్తోన్న వ్యక్తులెవరు? అన్న వాటిని ఎలా కనిపెట్టాడు? శివుడి అనుగ్రహంతో చందు ఎలాంటి కార్యాలు చేశాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఈ కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే..? ఒక యాక్షన్ సినిమాలో డివైన్ పాయింట్‌ను ఎలా కనెక్ట్ చేసారన్నది. ఇందుకు తగ్గట్టే అశ్విన్ బాబు క్యారక్టరైజేషన్ వుంటుంది. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదనే విషయాన్ని బలంగా నమ్మే వ్యక్తిగా అశ్విన్ బాబు రోల్ ఉంది. ఈ మిస్టీరియస్ థ్రిల్లర్‌లో కొన్ని డివోషనల్ ఇన్సిడెంట్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. దర్శకుడు అప్సర్ రాసుకున్న ఈ క్రైమ్ డ్రామా అక్కడక్కడా కొన్ని సస్పెన్స్ సీన్స్‌తో ఇంట్రెస్టింగ్గా సాగింది. పొరుగునున్న శత్రుదేశాల దాడి నేపథ్యంలో అల్లిన డ్రామా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందని విధంగా ఉంది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. అశ్విన్ బాబు పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో కనిపించాడు. రోజురోజుకీ ఆయన నటుడిగా మరింత పరిణతి చెందుతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన మెయింటైన్ చేసిన ఫీజిక్, తన స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. కొన్ని సన్నివేశాల్లో అయితే ఆయన నటన పీక్స్‌లో ఉంది. అలాగే అర్బాజ్ ఖాన్ సీరియస్ పోలీస్ అధికారిగా కనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో హీరోను డామినేట్ చేసేలా నటించాడు.
ఇక దిగంగనా సూర్యవంశీకి మూవీలో మంచి రోల్ దక్కింది. ఈ సినిమాలో కథలో భాగంగా అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మ్ చేసే అవకాశం తనకు దక్కింది. దీనిని తాను సద్వినియోగం చేసుకుంది. తద్వారా మంచి డ్యాన్సర్ అని ప్రూవ్ చేసుకుంది. హైపర్ ఆది తన మేనరిజంతో పంచులతో నవ్వులు పూయించాడు. బ్రహ్మాజీ, సాయి ధీన, మురళీ శర్మ, తులసి నటన డీసెంట్‌గా ఉంది.
ఇక టెక్నికల్ పరంగా చూస్తే, శివం భజే చాలా బావుంది. వికాస్ బడిస అందించిన సంగీతం చాలా బాగుంది. కొన్ని సీన్స్‌లో ఆయన ఇచ్చిన బీజీఎమ్ గూస్ బంప్స్ తెప్పించేలావుంది. శివేంద్ర సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అయింది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. వికాస్ బడిస మ్యూజిక్, సినిమాటోగ్రాఫర్ శివేంద్ర విజువల్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అలాగే చోటా కె ప్రసాద్ ఎడిటింగ్‌లో తన మార్క్ చూపించాడు. ఓవరాల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి.
ఇక మొత్తంగా చూస్తే, భారీ అంచనాల మధ్య వచ్చిన శివం భజే అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. అశ్విన్ బాబు యాక్టింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ బాగా హైలైట్ అయ్యాయి. కథ అక్కడక్కడా ఫ్లాట్‌గా సాగినా అశ్విన్ తన నటనతో ఆ లోటు తెలియనివ్వకుండా చేసాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు డివైన్ పాయింట్‌తో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. అన్ని ఎలెమెంట్స్ సరిగా కుదిరాయి. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళను అలరించేలా ఉంది. సో.. శివం భజే సినిమాతో హీరో అశ్విన్ బాబు ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడినట్టే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























