టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ‘బాహుబలి 1&2’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై సత్తా చాటడంతో రాజమౌళి పేరు అనేక దేశాల్లో మారుమ్రోగిపోయింది. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ చాలామంది ఆయనకు అభిమానులయ్యారు. దీంతో రాజమౌళి గతంలో దర్శకత్వం వహించిన పలు సినిమాలను ఓటీటీ లలో వీక్షించడానికి వారు ఆసక్తిని కనబరుస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ రాజమౌళి సినీ జీవితంపై స్పెషల్ డాక్యుమెటరీ ఒకటి రూపొందించిన విషయం తెలిసిందే. ‘మోడర్న్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి’ పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ.. జక్కన్న తన చిత్రాలతో ఇండియన్ సినిమాతోపాటు ప్రపంచ సినిమాపై చూపిన ప్రభావాన్ని తెలియజేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ డాక్యుమెటరీ తాజాగా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
కాగా మోడర్న్ మాస్టర్స్ సిరీస్లో భాగంగా తెరకెక్కించిన ఈ ప్రత్యేక డాక్యుమెంటరీని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనుపమ చోప్రా సమర్పించారు. ఇందులో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్, జో రుసో, కరణ్ జోహార్ లాంటి వాళ్లు కూడా రాజమౌళిపై తమ అభిప్రాయాలు పంచుకోవడం విశేషం. వీరితోపాటు రాజమౌళి చిత్రాలలో నటించిన టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి తదితరులు ఆయన గురించి చెప్పిన ఆసక్తికర విషయాలను కూడా చూపిస్తున్నారు.
ఈ డాక్యుమెంటరీ ద్వారా రాజమౌళి జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను, ఆయన గురించి బయటివారికి అంతగా తెలియని కొత్త కోణాలను ఆవిష్కరించనున్నారు. ఇక నెట్‌ఫ్లిక్స్ దీనితోపాటు ఈ ఏడాది అనేక ఇతర డాక్యుమెంటరీలను కూడా రూపొందించింది. వీటిలో ‘ది గ్రేటెస్ట్ రైవల్రీ ఇండియా వర్సెస్ పాకిస్థాన్’, ‘యో యో హనీ సింగ్: ఫేమస్’ అనే డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి. వీటికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుండటం గమనార్హం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























