మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్- జిక్కీ సాంగ్ ని రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ తన అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో మెస్మరైజింగ్ నెంబర్ ని కంపోజ్ చేశారు. సాంగ్ లో మోడరన్, క్లాసిక్ టచ్ ని అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఈ సాంగ్ వండర్ ఫుల్ మ్యూజికల్ గ్రాండియర్ ని అందిస్తోంది. లిరిక్ రైటర్ వనమాలి పొయిటిక్ డెప్త్ తో ఎమోషన్ ని కంప్లీట్ చేశారు. కార్తీక్, రమ్య బెహరా అందించిన వోకల్స్ టాప్ క్యాలిటీ, మెలోడీ ఇంటర్‌ప్లే సాంగ్ ఎసెన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఈ పాటలో విజువల్స్ స్టన్నింగ్ గా వున్నాయి. అద్భుతంగా వేసిన సెట్‌లు, రియల్ కాశ్మీర్ లోకేషన్స్ కట్టిపడేశాయి. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. ఈ రొమాంటిక్ మెలోడీ శోతల్ని మ్యూజికల్ పారడైజ్ లోకి తీసుకువెళుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ఇంకా జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: