నటీనటులు: రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా, ప్రగతి, అంకిత ఠాకూర్, మకరంద్ దేశ్‌పాండే, పృథ్వీ, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి తదితరులు
సంగీతం: జెబీ, భోలే షావలి
సినిమాటోగ్రఫీ: జవహర్ రెడ్డి యం.ఎన్
ఎడిటింగ్: బస్వా పైడిరెడ్డి
నిర్మాణం: సురక్ష్ ఎంటర్‌టైనమెంట్ మీడియా
నిర్మాత: మల్కాపురం శివకుమార్
దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా, మన్నారా చోప్రా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.
రాజ్ తరుణ్ ఇంతకుముందెన్నడూ లేనివిధంగా తొలిసారి మాస్ క్యారక్టర్ లో కనిపిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలైంది. ఇక సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరికి మరియు హీరో రాజ్ తరుణ్‌కు ఈ చిత్రం విజయం అందించిందా? లేదా? అన్నది చూద్దాం.
కథ:
కథానాయకుడైన గిరి (రాజ్‌తరుణ్) ఓ అనాథ. అనుకోని కారణంగా చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమవుతాడు. బస్తీవాసుల సాయంతో ఎదిగిన గిరి.. తనలా ఎవరూ బాధపడకూడదన్న ఉద్దేశంతో తప్పిపోయిన వారిని, రకరకాల సమస్యలతో ఇంటికి దూరమైనవాళ్లను వారి కుటుంబాలకు దగ్గర చేర్చే పనిని వృత్తిగా ఎంచుకుంటాడు. అమాయకత్వం, భయం కలగలిసిన అతనికి శైలజ (మాల్వీ మల్హోత్ర) పరిచయం అవుతుంది. అయితే గిరికి పూర్తి భిన్నమైన మనస్తత్వం ఆమెది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటుంది.
ఇక గిరి మంచి మనసు చూసి శైలజ (మాల్వీ మల్హోత్రా) అతడిని ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది. అయితే శైలజతో కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయంలో భార్య సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి అని గిరికి తెలుస్తుంది. అలాగే జహీరాబాద్ కొండారెడ్డి (మకందర్ దేశ్‌పాండే) అనే రౌడీ శైలజను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని కూడా తెలుస్తుంది.
అయితే అసలు ఆమె గిరిని పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి? కొండారెడ్డి నుంచి శైలజను గిరి ఎలా కాపాడుకున్నాడు? ఈ గొడవల కారణంగా గిరికి ఆప్తులైన ఆటోజానీ (బిత్తిరి సత్తి), మస్తాన్ (రాజా రవీంద్ర), తులసమ్మ (ప్రగతి) ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇంతకీ శైలజ గురించి కొండారెడ్డి వెతకడానికి కారణమేమిటి? అతనికి, శైలజకు సంబంధం ఏంటి? పిరికివాడైన గిరి, భార్య కోసం కొండారెడ్డిపై ఎలా తిరగబడ్డాడు? అన్నది అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
యూత్ ని ఆకట్టుకునే లవ్, ఫ్యామిలీ అంశాలు, ఎమోషన్స్, యాక్షన్ , మెసేజ్ ఇలా అన్నిరకాల అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. లవర్ బాయ్‌గా పాత్రలలో కనిపించే రాజ్ తరుణ్ ఈ సినిమాతో సరికొత్తగా యాక్షన్ జానర్‌ను ఎంచుకున్నాడు. దర్శకుడు ఎఎస్ రవికుమార్ పాత కథనే కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే ఆయన ఎంచుకున్న కథ బాగానే ఉన్నా, తెరకెక్కించడంలో అక్కడక్కడా కొద్దిగా తడబాటు కనిపించింది. రొటీన్ స్టోరీకి స్క్రీన్‌ప్లేతో తనదైన ట్రీట్‌మెంట్ ఇచ్చాడు.
ఒక వ్యక్తి అన్వేషణతో మొదలైన సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తుంది. గిరిని శైలజ ఇష్టపడే సీన్స్, మరియు పరిచయ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలో వచ్చే పెళ్లి తంతు, ఆ తర్వాత సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇలా గిరి, శైలజ మధ్య పరిచయం, వారి ప్రేమ కథతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇక ఇంటర్వెల్ సమయానికి శైలజ గురించి గిరికి నిజం తెలియడంతో ఒక్కసారిగా కథలో ట్విస్ట్ వస్తుంది.
ఈ పాయింట్‌తో సెకండాఫ్‌పై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు. ఇక కొండారెడ్డి శైలజ కోసం అన్వేషించడం, కొండారెడ్డి నుంచి శైలజను కాపాడుకోవడానికి రాజ్ వేసే ప్లాన్స్ తో మూవీ సాగుతుంది. అయితే ఇందులో కొండారెడ్డి లాంటి పవర్‌ఫుల్ పాత్రను సరిగ్గా వాడుకుంటే సినిమాకు ఇంకా మైలేజ్ ఉండేది. క్లైమాక్స్ ముందు వచ్చే భారీ ఫైట్ పర్వాలేదనిపించింది. అయితే ఇదంతా జరిగేది శైలజ ఆస్తి కోసం కావడం, ఇదే ఫార్ములాతో ఎన్నో సినిమాలు టాలీవుడ్ తెరపై చూడటంతో కొత్తదనం కనిపించదు.
ఇక నటీనటుల విషయానికొస్తే.. రాజ్‌తరుణ్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించాడు. తనకు కొత్తే అయినప్పటికీ మాస్ పాత్రలో బాగా చేసాడు. అయితే అతనిలోని యాక్టింగ్ స్కిల్‌ను, ఎనర్జీని దర్శకుడు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. హీరోయిన్ మాల్వీ మల్హోత్ర డీసెంట్ గా నటించింది. మకరంద్ దేశ్‌పాండే ప్రతినాయకుడిగా బాగా చేసాడు. అతడి పాత్రను ఇంకొంచెం బలంగా రాసుకుని ఉండాల్సింది.
రాధాభాయ్‌గా మన్నారా చోప్రా ఓ పాటలో తళుక్కుమనిపించింది. అలాగే ప్రగతి, రాజా రవీంద్ర, పృధ్వీ పరిధి మేరకు నటించారు. పాటలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఇక అక్కడక్కడా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. జవహర్ రెడ్డి అందించిన కెమెరా పనితీరు బావుంది. నిర్మాణపరంగా ఫర్వాలేదనిపించింది. మొత్తానికి తిరగబడరసామీ ఫక్తు కమర్షియల్ మూవీ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: