కేరళ లోని వరద బాధితులకు సెలబ్రిటీల నుండి ఆర్థిక సహాయాలు అందుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే తమిళ్ స్టార్ హీరోలు విక్రమ్, సూర్య, కార్తీ తో పాటు పలువురు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాలు అందించారు. ఇప్పుడు ఈ జాబితాలో లక్కీ భాస్కర్ టీమ్ కూడా చేరిపోయింది. లక్కీ భాస్కర్ టీమ్ కేరళ బాధితులకు 5 లక్షల విరాళం అందించినట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. అక్కడ భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఘటనలో మృతుల సంఖ్య 300కిపైగా చేరినట్టు తెలుస్తుంది. అంతేకాదు కొండచరియల క్రింద ఇంకా చాలా మృతదేహాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవాపు ఆర్మీ, వైమానిక దళం, నేవీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక దళం, స్థానికులకు చెందిన రెస్క్యూ టీమ్‌లు ఇప్పటికే సహాయక చర్యలు అందిస్తున్నారు.
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో లక్కీ భాస్కర్ సినిమా వస్తుంది. ఈసినిమాలో దుల్కర్ బ్యాంక్ క్యాషియర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ శ్రీమతి గారు పాట మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి. ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈసినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. జీవీ ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 7వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: