టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఫియర్ సాంగ్ అయితే యూట్యూబ్‌లో మిలియన్లకుపైగా వ్యూస్ అందుకుంది. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది దేవర సెకండ్ సింగిల్ గురించి. ఎందుకంటే ఈ సెకండ్ సింగిల్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్ అని వార్తలు రావడమే. ఇక తాజాగా ఇప్పుడు ఆ అప్ డేట్ వచ్చేసింది. దేవర సెకండ్ సింగిల్ ను ఆగష్ట్ 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా తెలియచేశారు. అంతేకాదు ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటుంది.
కాగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా, సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తీర ప్రాంతం నేపథ్యం, ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: