“హాస్యబ్రహ్మ” జంధ్యాల దర్శకత్వంలో పలు జనరంజక వినోదాత్మక చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘జయమ్ము నిశ్చయమ్మురా!’ ఒకటి. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, సుమలత, అవంతి నాయకా నాయికలుగా నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుత్తివేలు, శ్రీలక్ష్మి, రాధాకుమారి తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటుడిగా తొలి అడుగులు వేయగా… సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్, సుమన్, రమేష్ బాబు అతిథి పాత్రల్లో తళుక్కున మెరిసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజ్-కోటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అలరించాయి. సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు సమర్పణలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను సుదర్శన పిక్చర్స్ పతాకంపై జి.వి.హెచ్.ప్రసాద్ నిర్మించారు. 1989 జూలై 6న విడుదలై ఘనవిజయం సాధించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా!’… నేటితో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
[youtube_video videoid=knbLGMRBTEc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: