
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 72


చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మహానటి!

జనసేన కోసం నితిన్ భారీ విరాళం

విజయ్ దేవరకొండ తో 'మజిలీ' డైరెక్టర్

జెర్సీ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్స్ ఫిక్స్

ఆఫ్రికాలో '96' రీమేక్ తొలి షెడ్యూల్?

ఏడాది చివరలో పట్టాలెక్కనున్న సూర్య, శివ చిత్రం?

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో శర్వానంద్ మూవీ?

'టెంపర్' రీమేక్ 'అయోగ్య' కి రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సార్ పూర్తిచేసుకున్న కాంచన 3

తెలుగు నెటివిటీకి దగ్గరగా 'లూసీఫర్' డబ్బింగ్

'అవెంజర్స్ ఎండ్ గేమ్' ట్రైలర్ రిలీజ్

సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రలహరి

అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అప్ డేట్

'కబీర్ సింగ్' టీజర్ రిలీజ్

వర్మ 'కోబ్రా' ఫస్ట్ లుక్ రిలీజ్

అల్లు అర్జున్ #21 కి ఇంట్రెస్టింగ్ టైటిల్

పోర్చుగల్ కు పయనమవుతున్న రెండో 'మన్మథుడు'
17 ఏళ్ల క్రితం పారిస్ లో 'మన్మథుడు' గా కింగ్ నాగార్జున చేసిన సందడిని అంత సులువుగా మర్చిపోలేము. ఇప్పటికీ 'మన్మథుడు' పేరు వినగానే ఆ హాస్య సన్నివేశాలు కళ్లముందు కదలాడతాయి.

ఓటర్ మూవీ నుండి థీమ్ సాంగ్ రిలీజ్
జి.ఎస్.కార్తిక్ దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఓటర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో ప్రారంభించారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ సినిమా థీమ్ సాంగ్ లిరికల్ వీడియోను ఈరోజు రిలీజ్ చేశారు.

చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మహానటి!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా షూటింగ్ జరుపుకుంటుండగా… మే చివరికల్లా దాదాపు సైరా షూటింగ్ ఒక కొలిక్కి వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తరువాత చిరు-కొరటాల కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందన్న సంగతి కూడా విదితమే.

జనసేన కోసం నితిన్ భారీ విరాళం
పవన్ కళ్యాణ్ అంటే యంగ్ హీరో నితిన్ కు ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ను ఇన్స్ఫిరేషన్ గా తీసుకునే తాను సినిమాల్లోకి వచ్చానని.. పవన్ అంటే తనకు పిచ్చని చాలా సందర్బాల్లో నితిన్ చెప్పాడు. ఇక తన సినిమా ఆడియో ఫంక్షన్లకు.. ప్రిరిలీజ్ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా పవన్‌నే ఆహ్వానిస్తుంటాడు. ఇక తనపై ఉన్న అభిమానం కారణంతో పవన్ కూడా నితిన్ పిలిచినవెంటనే కాదనకుండా వెళతాడు.

విజయ్ దేవరకొండ తో 'మజిలీ' డైరెక్టర్
ఒక సినిమా హిట్టయితే చాలు ఆఫర్లు వరుసపెట్టి వస్తూనే ఉంటాయి. అలాంటిది వరుసగా రెండు హిట్లు ఇస్తే ఆ డైరెక్టర్ కు మామూలు డిమాండ్ ఉండదు. ఇప్పుడు శివ నిర్వాణ కు అలాంటి డిమాండే పెరిగిపోయింది. నిన్ను కోరి సినిమాతో హిట్ కొట్టిన శివ నిర్వాణ… రీసెంట్ గా నాగచైతన్య, సమంత, దివ్యాంష కౌషిక్ కాంబినేషన్ లో వచ్చిన మజిలీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో మంచి ఫీల్ గుడ్ మూవీని తీసిన శివ నిర్వాణ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రెండు షేడ్స్ లో నాగ చైతన్య చాలా బాగా నటించాడని..సమంత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని… మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో.. నాగ చైతన్య భార్యగా శ్రావణి క్యారెక్టర్ లో…

జెర్సీ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్స్ ఫిక్స్
మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఇక ఈ చిత్రం ఏప్రిల్ 19న తెలుగు తో పాటు హిందీ లోనూ విడుదలకానుంది. నాని హీరోగా జెర్సీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడటంతో ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిలో భాగంగానే ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 12న ఉదయం 9గంటలకు రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

ఆఫ్రికాలో '96' రీమేక్ తొలి షెడ్యూల్?
తమిళనాట ఘన విజయం సాధించిన '96' తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా… ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.

ఏడాది చివరలో పట్టాలెక్కనున్న సూర్య, శివ చిత్రం?
కోలీవుడ్ స్టార్ సూర్య చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన పొలిటికల్ థ్రిల్లర్ 'ఎన్.జి.కె' మే 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుండగా… మరో యాక్షన్ ఎంటర్ టైనర్ 'కాప్పాన్' ఆగస్టు 30న రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఆసక్తికరమైన టైటిల్ తో రజినీకాంత్, మురుగదాస్ చిత్రం
సూపర్ స్టార్ రజినీకాంత్, బ్రిలియంట్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో శర్వానంద్ మూవీ?
యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నాడు. కథానుసారం… శర్వానంద్ ప్లే బాయ్, ఏజ్డ్ గ్యాంగ్ స్టర్.. ఇలా టు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపిస్తాడట.

'టెంపర్' రీమేక్ 'అయోగ్య' కి రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'టెంపర్'… తమిళంలో 'అయోగ్య' పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే.

మజిలీ టార్గెట్ 22 కోట్లు.3 రోజుల్లో టోటల్ గా వచ్చింది ఇది!!
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత, దివ్యాంష కౌషిక్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మజిలీ ఏప్రిల్ 5న రిలీజ్ మంచి హిట్ టాక్ తో దూసుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ ని రాబట్టుకుంటుంది. తొలి రెండు రోజుల్లో 13.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా.. మూడో రోజు కొద్దిగా డీలా పడినా... ఓవరాల్ గా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లోకేషన్స్ లో వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. ఏరియాల వారి సినిమా 3 రోజుల వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే.. నైజాం - 5.91 కోట్లు సీడెడ్ - 2.09కోట్లు యూఏ - 2కోట్లు ఈస్ట్: 0. 85 కోట్లు వెస్ట్ - 0.80 కోట్లు కృష్ణ - 1.04కోట్లు గూంటూరు…

సెన్సార్ పూర్తిచేసుకున్న కాంచన 3
2007లో తన స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ముని అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు లారెన్స్. సూపర్ హిట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ముని సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాంచన 3. ఇప్పటికే మూవీ పోస్టర్స్ కు టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేషన్ ను పొందింది. తమిళం తోపాటు తెలుగులో ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు నెటివిటీకి దగ్గరగా 'లూసీఫర్' డబ్బింగ్
ఇద్దరు సినిమా తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆ తరువాత పెద్దగా తెలుగులో సినిమాలు రిలీజ్ చేయలేదు. దాదాపు చాలా ఏళ్ల తరువాత ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’ లాంటి సినిమాలతో వచ్చి మరోసారి తన సత్తా చూపించాడు. ఇక జనతా గ్యారెజ్ సినిమా తరువాత అయితే మోహన్ లాల్ క్రేజ్ తెలుగులో మరింత పెరిగిందని చెప్పొచ్చు. అందుకే ఆయన మలయాళంలో నటించిన సినిమాలన్నింటినీ తెలుగులో కూడా రిలీజ్ చేసి ఆయన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.

'అవెంజర్స్ ఎండ్ గేమ్' ట్రైలర్ రిలీజ్
అవెంజర్స్ సిరీస్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సూపర్ హీరోస్ అందరు కలిసి నటిస్తున్న ఈ అవెంజర్స్ సీరీస్ లో ఎండ్ పార్ట్ గా వస్తున్న 'అవెంజర్స్ ఎండ్ గేమ్' సినిమా కోసం ఇండియన్ సిని ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమాకు స్పెషల్ గా ఏ.ఆర్.రెహమాన్ ఓ కొత్త పాటతో ముందుకొచ్చాడు. మార్వెల్ స్టూడియోతో కలిసి మార్వెల్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకించి మార్వెల్ యాంతం తో ఓ పాటను కంపోజ్ చేసి రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రలహరి
కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'చిత్రలహరి'. ఏప్రిల్ 12వ తేదీన ఈసినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. ఈ సినిమాతో తేజ్ కు హిట్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాడు. ఇప్పుడు తాజాగా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది 'చిత్రలహరి'.

అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అప్ డేట్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాదే ఈ సినిమా గురించి వార్తలు వచ్చినా...ఈ ఏడాది ఈ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పినా డేట్ మాత్రం ఇంత వరకూ ఫిక్స్ చేయలేదు.

'కబీర్ సింగ్' టీజర్ రిలీజ్
సందీప్ వంగా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాను తమిళ్ లోనూ.. హిందీలోనూ రీమేక్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. తమిళ్ లో విక్రమ్ తనయుడు దృవ్ హీరోగా నటిస్తుండగా.. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.

వర్మ 'కోబ్రా' ఫస్ట్ లుక్ రిలీజ్
మొన్నటి వరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ... ఇప్పుడు కోబ్రా అంటూ మరో సంచలన సృష్టించడానికి వస్తున్నాడు. అయితే ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే.. ఇన్ని రోజులు ఒక డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా.. కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇస్తూ.. పాటలు పాడటం ఇలా తనకు ఏది నచ్చితే అది చేసి పలు అవతారాలు ఎత్తిన వర్మ...ఇప్పుడు నటుడిగా మారి అందరికీ షాకిస్తున్నాడు.

అల్లు అర్జున్ #21 కి ఇంట్రెస్టింగ్ టైటిల్
నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత అల్లు అర్జున్ లాంగ్ గ్యాపే తీసుకున్నాడు. అయితే ఇంత గ్యాప్ తీసుకున్న బన్నీ ఈ ఏడాది మాత్రం వరుస సినిమాలతో వచ్చేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టిన బన్నీ ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా తన 21వ సినిమా టైటిల్ ను అధికారింగా ప్రకటించాడు.