
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 71


రిలీజయిన జెర్సీ మూవీ ట్రైలర్

చిత్రలహరి మూవీ మౌత్ టాక్

హీరోలకు కెరీర్ బెస్ట్ ఇస్తున్న సమంత

‘ఆర్ ఆర్ ఆర్’లో నిత్య మీనన్?

అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’కు 5 ఏళ్ళు

‘చిత్రలహరి’తో దేవిశ్రీ ప్రసాద్ సెంటిమెంట్

ఆ మూవీ రీమేక్ నేను చేయట్లేదు

మజిలీ 5 డేస్ కలెక్షన్స్

రజినీ 'దర్బార్' షూటింగ్ ప్రారంభం

రిలీజయిన కల్కి మూవీ టీజర్

‘నరసింహ’కి 20 ఏళ్ళు

మురుగదాస్ కథతో త్రిష చిత్రం

'బంగార్రాజు'తో అఖిల్ సందడి?

డిఫరెంట్ లుక్స్ లో మహేష్ బాబు

'చిత్రలహరి' ప్రీ రిలీజ్ బిజినెస్ డిటైల్స్

మెగాస్టార్ చిరంజీవి ‘దేవాంతకుడు’కి 35 ఏళ్ళు
“జీవితంలో ఆటలు బాగుంటాయి గాని జీవితంతో ఆటలు చాలా ప్రమాదం” అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ‘దేవాంతకుడు’. మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎ.చంద్రశేఖర్ (కోలీవుడ్ స్టార్ విజయ్ తండ్రి) దర్శకత్వం వహించాడు. కన్నడంలో విజయం సాధించిన గెలువు నన్నదే(అక్కడ కూడా చంద్రశేఖరే దర్శకుడు) కి రీమేక్ వెర్షన్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దాడు దర్శకుడు చంద్రశేఖర్. గుమ్మడి వెంకటేశ్వరరావు, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, వరలక్ష్మి, నారాయణరావు, రోహిణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక జె.వి.రాఘవులు స్వరపరచిన పాటల్లో “చెల్లెమ్మకు పెళ్ళంటా… అన్నయ్యకు…

‘వెంకీ మామ’తో చైతు ఆ విషయంలో హ్యాట్రిక్ కొడతాడా?
అక్కినేని నాగ చైతన్య… ‘జోష్’ సినిమాతో అక్కినేని వారసుడిగా వెండి తెరకు పరిచయమైనా… అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటివరకు 17 సినిమాల్లో హీరోగా నటించగా… ‘ఏ మాయ చేసావే’, ‘100% లవ్’, ‘తడాఖా’, ‘మనం’ ‘ప్రేమమ్’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’… తాజాగా‘మజిలీ’తో ఘన విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ప్రస్తుతం తన రియల్ లైఫ్ మేనమామ, సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘వెంకీ మామ’ అనే మల్టీస్టారర్ మూవీలో చైతు నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే… మల్టీస్టారర్ మూవీలో నటించడం చైతూకి ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలా రెండు సినిమాల్లో నటించి విజయాలు…

మరో రెండు చిత్రాలకు సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్?
ఈ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. ఫలితమే… వరుస సినిమాలతో పలకరిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. దాదాపు ఎనిమిది నెలల గ్యాప్ లో ‘కాలా’, ‘2.0’, ‘పేట’తో పలకరించిన సూపర్ స్టార్… ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్న ‘దర్బార్’లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. కాగా… ఈ చిత్రంతో పాటు మరో రెండు ఆసక్తికరమైన సినిమాలకు కూడా రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ టాక్.

రిలీజయిన జెర్సీ మూవీ ట్రైలర్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా జెర్సీ మూవీ ఏప్రిల్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో నాని క్రికెటర్ గా నటించిన జెర్సీ మూవీ లో హీరోయిన్ గా కన్నడ, తమిళ, మలయాళ భాషల చిత్రాలలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే జెర్సీ మూవీ పై అంచనాలు పెరిగాయి.

చిత్రలహరి మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

హీరోలకు కెరీర్ బెస్ట్ ఇస్తున్న సమంత
సమంత… టాలీవుడ్ లో దాదాపు దశాబ్ద కాలంగా ఏడాదికో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్. గత ఏడాది ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘అభిమన్యుడు’ లాంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ చెన్నై బ్యూటీ… పెళ్లి తర్వాత తొలిసారి భర్త నాగ చైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’తో ఈ ఏడాది తొలి తెలుగు విజయాన్ని అందుకుంది. అంతేకాదు… భర్తకి కెరీర్ బెస్ట్ ని అందించడంలో భాగమయింది. ఇప్పుడే కాదు గతంలో కూడా ఈమె నటించిన చిత్రాలపై ఓ లుక్కేస్తే… ఆ సినిమాలలోని ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ లో భాగమవడం విశేషం.

‘ఆర్ ఆర్ ఆర్’లో నిత్య మీనన్?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాట్రియోటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు చరణ్ కు జంటగా ఉత్తరాది భామ అలియా భట్ నటించనుంది. ఇక ఎన్టీఆర్ కు జోడిగా బ్రిటిష్ సుందరి డైసీ ఎడ్గార్ జోన్స్ నటించనున్నట్లు ఇది వరకే ప్రకటన చేసింది చిత్ర బృందం. అయితే… ఇప్పుడు ఈ ప్రేస్టేజియస్ ప్రాజెక్ట్ నుంచి బ్రిటిష్ భామ తప్పుకున్న వైనంలో… ఈమె పాత్రలో ఎవరు నటించనున్నారోననే ఆసక్తి సర్వత్రా…

అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’కు 5 ఏళ్ళు
అన్నదమ్ముల సెంటిమెంట్ తో తెరకెక్కిన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే… టామ్ అండ్ జెర్రీ లా నిత్యం కొట్టుకుంటూ ఉండే అన్నదమ్ముల మధ్య అంతర్లీనంగా సెంటిమెంట్ ను చూపిస్తూ… దాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రం మాత్రం ‘రేసుగుర్రం’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, శ్యామ్ అన్నదమ్ములుగా నటించగా… శ్రుతి హాసన్, సలోని, ప్రకాష్ రాజ్, రవికిషన్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బన్నీని తొలిసారి డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి… బన్నీ ఎనర్జీకి తగ్గ కథను రాసుకోవడంలో నూటికి నూరు శాతం విజయం సాధించాడు.

‘చిత్రలహరి’తో దేవిశ్రీ ప్రసాద్ సెంటిమెంట్
‘దేవి’(1999)చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ లో డీఎస్పి అని ముద్దుగా పిలుచుకునే ఈ టాలీవుడ్ రాక్ స్టార్… గత రెండు దశాబ్దాలుగా తన స్వరాలతో సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాడు. ఓ పక్క అగ్ర కథానాయకుల సినిమాలకు సంగీతం అందిస్తూనే… మరోవైపు యంగ్ హీరోస్ చిత్రాలకి కూడా తనదైన మార్కు బాణీలతో ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే… ఇప్పుడు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు అడుగు దూరంలో ఉన్నాడీ ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.

ఆది 'బుర్రకథ' మోషన్ పోస్టర్ రిలీజ్
ప్రేమ కావాలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది సాయి కుమార్ ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్టు కొట్టాడు. అయితే ఆ తరువాత సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో సరైన హిట్టు కోసం ఎప్పటినుండో వెయిట్ చూస్తున్నాడు ఆది. యువ కథానాయకులతో పోటీ పడటానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.

ఆ మూవీ రీమేక్ నేను చేయట్లేదు
మెగా మేల్లుడు సాయి తేజ్ ప్రస్తుతం తన హోప్స్ అన్నీ 'చిత్రలహరి' సినిమాపైనే పెట్టుకున్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా హిట్స్ కోసం ఎదురుచూస్తున్న తేజ్.. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఇక రిలీజ్ కూడా దగ్గరలో ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు తేజ్. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 12వరకూ ఆగాల్సిందే.

‘క్యాష్ క్యాష్’ చిత్రం లోని నోట్లరద్దు గీతాన్ని విడుదలచేసిన దర్శకుడు ‘బాబీ
తమిళంలో ‘థట్రోమ్ థూక్రోమ్’ పేరుతో రూపొందుతున్న చిత్రమ్ ‘క్యాష్ క్యాష్’ పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది. మీడియా మార్షల్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు అరుళ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మొదటి సింగిల్ 'డిమోనిటైజెషన్ సాంగ్' ను దర్శకుడు బాబీ ఈ రోజు విడుదల చేసారు.

మజిలీ 5 డేస్ కలెక్షన్స్
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత, దివ్యాంష కౌషిక్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మజిలీ మూవీ ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఘన విజయం సాధించింది. నాగ చైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో మొదటి స్థానం సొంతం చేసుకొని భారీ వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే అనుకున్న టార్గెట్ ను రీచ్ అయిన మజిలీ కలెక్షన్స్.. థియేటర్లలో వేరే సినిమాలు కూడా లేకపోవడంతో ముందు ముందు కూడా మంచి వసూళ్లను రాబట్టి మంచి లాభలను తెచ్చి పెడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రజినీ 'దర్బార్' షూటింగ్ ప్రారంభం
యంగ్ హీరోలతో సమానంగా వరుస సినిమాలు చేస్తూ తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ దూసుకుపోతున్నారు. 'కబాలి', 'కాలా', 'పేటా' ఇలా వైవిద్యమైన కథలతో.. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ తో తన అభిమానులను థ్రిల్ కు గురిచేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మురగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'దర్బార్' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

రిలీజయిన కల్కి మూవీ టీజర్
హ్యాపీ మూవీస్ బ్యానర్ పై శివాని శివాత్మిక సమర్పణ లో సి కళ్యాణ్ నిర్మాతగా సైకలాజికల్ థ్రిల్లర్ అ! మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా వాస్తవ సంఘటనలు ఆధారంగా కల్కి మూవీ రూపొందుతుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న కల్కి మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. అదా శర్మ, నందిని శ్వేత హీరోయిన్స్. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

‘నరసింహ’కి 20 ఏళ్ళు
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అయితే… ‘బాషా’ తరువాత రజినీ నటించిన చిత్రాలకు తెలుగునాట మరింత క్రేజ్ పెరిగింది. అయితే… ఆ క్రేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళిన చిత్రం మాత్రం ‘నరసింహ’ (తమిళంలో ‘పడయప్ప’). “నా దారి రహదారి” అంటూ రజినీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ‘ముత్తు’ తర్వాత దర్శకుడు కె.ఎస్.రవికుమార్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. శివాజీ గణేషన్, సౌందర్య, రాధారవి, మణివన్నన్, నాజర్, సితార, అబ్బాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డబుల్ ఆస్కార్ అవార్డు గ్రహీత…

మురుగదాస్ కథతో త్రిష చిత్రం
తమిళ బ్లాక్ బస్టర్ మూవీ '96' తో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ రజినీకాంత్ కి జోడిగా 'పేట' లో మురిపించిన త్రిష… తాజాగా ఓ ఆసక్తికరమైన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ టాక్.

'బంగార్రాజు'తో అఖిల్ సందడి?
2016 సంక్రాంతికి విడుదలైన 'సోగ్గాడే చిన్ని నాయనా' ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ మూడేళ్ల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ తెరకెక్కనుంది. 'బంగార్రాజు' పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున… తొలి భాగం తరహాలోనే తండ్రీ కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయంతో సందడి చేయనున్నాడు.

డిఫరెంట్ లుక్స్ లో మహేష్ బాబు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న మహర్షి మూవీ మే నెల 9వ తేదీ రిలీజ్ కానుంది. మహర్షి మూవీ లో మహేష్ బాబు స్టూడెంట్ , బిజినెస్ మాన్, కామన్ మాన్ గా మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు. పూజా హెగ్డే కధానాయిక. అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

'చిత్రలహరి' ప్రీ రిలీజ్ బిజినెస్ డిటైల్స్
మెగా కాంపౌండ్ హీరో సాయి (ధరమ్) తేజ్ కథానాయకుడిగా 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించిన చిత్రం 'చిత్రలహరి'. సాయి తేజ్ కి జోడిగా కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ మ్యూజికల్ ఎంటర్ టైనర్ ని నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా… రేపు (ఏప్రిల్ 12) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.