2007లో తన స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ముని అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు లారెన్స్. సూపర్ హిట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ముని సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాంచన 3. ఇప్పటికే మూవీ పోస్టర్స్ కు టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేషన్ ను పొందింది. తమిళం తోపాటు తెలుగులో ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో లారెన్స్ సరసన ఓవియా, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల కానున్న ఈసినిమాను.. లారెన్స్ సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. తెలుగులో ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు రిలీజ్ చేయనున్నారు.
[youtube_video videoid=s01YohDdGZE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























