సందీప్ వంగా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాను తమిళ్ లోనూ.. హిందీలోనూ రీమేక్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. తమిళ్ లో విక్రమ్ తనయుడు దృవ్ హీరోగా నటిస్తుండగా.. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా షాహిద్ కపూర్ నటిస్తున్న కబీర్ సింగ్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ ను చూస్తుంటే.. టీజర్ దాదాపు అర్జున్ రెడ్డి స్టైల్లోనే ఉంది. షాహిద్ లుక్స్‌తో పాటు సీన్స్, డైలాగ్స్ అన్ని అర్జున్ రెడ్డినే దించేసినట్టుగా అనిపిస్తుంది. ఇక కాంట్రవర్సీ డైలాగ్స్ కూడా చూపించాడు. ఇక్కడ ఆ డైలాగ్స్ కు పెద్ద రచ్చనే జరిగింది. మరి బాలీవుడ్ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. అక్కడ కూడా ఈ డైలాగ్స్ కు ఏదైనా రచ్చ జరుగుతుందేమో చూడాలి..
కాగా అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ వంగానే దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో షాహిద్ కపూర్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయనున్నారు. సినీ 1 స్టూడియోస్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి టాలీవుడ్లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి, బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూద్దాం..
[youtube_video videoid=eq2ek0mdji4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: