ఇద్దరు సినిమా తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆ తరువాత పెద్దగా తెలుగులో సినిమాలు రిలీజ్ చేయలేదు. దాదాపు చాలా ఏళ్ల తరువాత ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’ లాంటి సినిమాలతో వచ్చి మరోసారి తన సత్తా చూపించాడు. ఇక జనతా గ్యారెజ్ సినిమా తరువాత అయితే మోహన్ లాల్ క్రేజ్ తెలుగులో మరింత పెరిగిందని చెప్పొచ్చు. అందుకే ఆయన మలయాళంలో నటించిన సినిమాలన్నింటినీ తెలుగులో కూడా రిలీజ్ చేసి ఆయన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే ఇటీవల మలయాళంలో రిలీజ్ అయిన లూసీఫర్ సినిమాను కూడా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా డబ్బింగ్ కు సంబంధించి కొన్ని ఫొటోలు బయటకు కూడా వచ్చాయి. ఇక వాటిని చూస్తుంటే డబ్బింగ్ ను చాలా జాగత్రగా.. ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలుగు నేటివిటీకీ చాలాా దగ్గరగా ఉండేలా డబ్బింగ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
కాగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ విలన్‌గా నటించాడు. మంజు వారియర్ హీరోయిన్‌గా నటించింది. మరి ఔట్ అండ్ ఔట్ మాస్ కమ్ పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరి తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో చూద్దాం..
[youtube_video videoid=iKsu1eGXIzc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























