
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 51


నాని కోసం రెండు ఆసక్తికరమైన కథలు

ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్ ప్రకటన

లాంగ్ షెడ్యూల్‌లో ‘ఆర్ ఆర్ ఆర్’

నాలుగు వైవిధ్యమైన పాత్రల్లో `ఆర్ ఎక్స్100` భామ

‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ పాత్ర అదేనా?

ఓ బేబీ మూవీ టీజర్ రిలీజ్

బస్తీమే సవాల్ -RGV

విజయ్ దేవరకొండతో హను రాఘవపూడి చిత్రం?

మోహన్ బాబుకి జోడీగా ఐశ్వర్యా రాయ్?

మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఘాటు రిప్లై

విడుదల కానున్న లక్ష్మీస్ NTR మూవీ

తాప్సీ గేమ్ ఓవర్ మూవీ రిలీజ్ త్వరలో

అఖిల్ కొత్త చిత్రం ప్రారంభం

ఇబ్బంది లో తమిళ మూవీ వర్మ (అర్జున్ రెడ్డి )

రెండో షెడ్యూల్‌కి సిద్ధమవుతున్న `డిస్కో రాజా`
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో ‘డిస్కో రాజా’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్ద పీట వేస్తూ ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు.

నాని కోసం రెండు ఆసక్తికరమైన కథలు
ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం యువ కథానాయకుడు నాని శైలి. ప్రస్తుతం ఒకవైపు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో నటిస్తూనే… మరోవైపు తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ చిత్రం చేస్తున్నాడు ఈ నేచురల్ స్టార్. అంతేకాదు.. విలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం నాని కాల్షీట్స్ కోసం రెండు ఆసక్తికరమైన కథలు ఎదురు చూస్తున్నాయని టాక్.

నెల రోజుల గ్యాప్‌లోనే రానున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్?
తాజాగా ‘సీత’ చిత్రంతో పలకరించిన యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్… నెల రోజుల గ్యాప్‌లోనే మరో సినిమాతో సందడి చేయబోతున్నాడట.

ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్ ప్రకటన
సూపర్ హిట్ బద్రి మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయి పోకిరి, దేశముదురు వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన పూరి జగన్నాథ్ దర్శకత్వం లో , బ్లాక్ బస్టర్ మూవీ దేవదాసు తో హీరో గా తన డాన్స్, పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని రెడీ, కందిరీగ వంటి సూపర్ హిట్ మూవీస్ తో స్టార్ హీరో గా మారిన రామ్ పోతినేని హీరోగా డబుల్ దిమాక్ హైదరాబాదీ ట్యాగ్ లైన్ తో రూపొందిన రొమాంటిక్, యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ జూలై 12 వ తేదీ రిలీజ్ కానుంది.

లాంగ్ షెడ్యూల్‌లో ‘ఆర్ ఆర్ ఆర్’
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెరుపువేగంతో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో… తారక్, చెర్రీ వేర్వేరు సందర్భాల్లో గాయపడటంతో షూటింగ్‌కు స్వల్ప విరామం ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు గాయం నుంచి కోలుకోవడంతో ఇటీవలే తాజా షెడ్యూల్‌ను ప్రారంభించారు.

నాలుగు వైవిధ్యమైన పాత్రల్లో `ఆర్ ఎక్స్100` భామ
గత ఏడాది విడుదలైన ఆర్ ఎక్స్100తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమాలో బోల్డ్‌గా నటించి కుర్రకారు మనసును దోచుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… స్వల్ప విరామం అనంతరం వరుసగా నాలుగు ప్రాజెక్ట్‌లను అంగీకరించింది. అంతేకాదు… ఇవన్నీ కూడా నటిగా తనకు సవాల్ విసిరే పాత్రలేనట.

‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ పాత్ర అదేనా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్ హైదరాబాదీ’ అనేది ట్యాగ్‌లైన్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు. హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసే పూరి… ఈ సినిమాను కూడా తన మార్క్ డైరెక్షన్‌తోనే తెరకెక్కించినట్టు… ఇటీవల విడుదలైన టీజర్‌ను బట్టి అర్ధమవుతోంది. ఇదిలా ఉంటే… కొత్త తరహా కాన్సెప్ట్‌తో సాగే ఈ సబ్జెక్ట్‌లో రామ్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని టాలీవుడ్ టాక్.

హిప్పీ మూవీ మూడవ లిరికల్ సాంగ్ విడుదల
హీరో కార్తికేయ, దిగాంగన జంటగా TN కృష్ణ దర్శకత్వం లో V క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన హిప్పీ మూవీ జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది. JD చక్రవర్తి ఒక ముఖ్య పాత్రలో నటించారు. హిప్పీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.నివాస్ K ప్రసన్న సంగీతం అందించారు.

శర్వానంద్ 27 వ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు , శతమానం భవతి, మహానుభావుడు వంటి ఫీల్ గుడ్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్ హీరోగా, స్వామి రారా వంటి హిట్ మూవీ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 27 వ మూవీ రూపొందుతుంది. గ్యాంగ్ స్టర్ గా శర్వానంద్ నటిస్తున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఓ బేబీ మూవీ టీజర్ రిలీజ్
తెలుగు, తమిళ భాషల సక్సెస్ ఫుల్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ ,కామెడీ డ్రామా ఓ బేబీ మూవీ జూన్ లో రిలీజ్ కానుంది. ఓ బేబీ ప్రమోషన్స్ లో భాగంగా మే 21 వ తేదీ ఫస్ట్ లుక్ రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రోజు( 25వ తేదీ ) టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ ను చూసిన ప్రేక్షకులు ఓ బేబీ మూవీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనుందనే అభిప్రాయం వెలిబుచ్చారు.

బస్తీమే సవాల్ -RGV
రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో లక్ష్మీస్ NTR మూవీ రూపొందింది. లక్ష్మీస్ NTR మూవీప్రెస్ మీట్ నిర్వహించడానికి విజయ వాడ వెళ్ళిన RGV ని పోలీసులు అడ్డుకుని, విజయవాడ లో అడుగు పెట్టకుండా చేసిన విషయం తెలిసిందే. పోలీసులు అడ్డుకునేలా చేసింది CM చంద్రబాబు నాయుడు అని RGV ఆరోపణ. ఎన్నికలలో చంద్రబాబు పరాజయం పొందడంతో RGV ఆయన పై సవాల్ చేశారు.

విజయ్ దేవరకొండతో హను రాఘవపూడి చిత్రం?
వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ హీరో కాల్షీట్స్ కోసం… పలువురు దర్శకులు కథలతో సిద్ధంగా ఉన్నారు. వారిలో… హను రాఘవపూడి ఒకరు.

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్?
ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టే యువ కథానాయకులలో శర్వానంద్ ఒకరు. ఆ మధ్య టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్‌లో సినిమా చేస్తూనే… తమిళ రీమేక్ చిత్రం ‘96’ను పట్టాలెక్కించాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇక తాజాగా సుధీర్ వర్మ కాంబినేషన్ మూవీని పూర్తి చేసిన శర్వా… ఇప్పుడు ‘96’ షూటింగ్‌లో పాల్గొంటూనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నాడట.

మోహన్ బాబుకి జోడీగా ఐశ్వర్యా రాయ్?
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఇద్దరు’(1997) సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది అందాల తార ఐశ్వర్యా రాయ్. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘గురు’, ‘రావణ్’ (తెలుగులో విలన్) చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రానుంది. తాజాగా ఈ విషయాన్ని ఐశ్వర్యా రాయ్ స్వయంగా ధ్రువీకరించింది.

మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఘాటు రిప్లై
మలయాళ హీరో ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా లో తనపై ట్రోల్స్ చేసిన వారికి ఘాటు రిప్లై ఇచ్చారు. భాగమతి, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఉన్ని ముకుందన్ పరిచయమే. నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధాన మంత్రి కానుందున ఉన్ని ముకుందన్ అభినందనలు తెలిపారు.

విడుదల కానున్న లక్ష్మీస్ NTR మూవీ
GV ఫిల్మ్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో బయోగ్రాఫికల్ డ్రామా లక్ష్మీస్ NTR మూవీ రూపొందిందింది. NTR గా రంగస్థల నటుడు విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి గా యఙ్ఞశెట్టి, చంద్ర బాబు నాయుడు గా శ్రీతేజ్ నటించారు. NTR జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాలు, వెన్నుపోటు నేపథ్యం లో లక్ష్మీస్ NTR మూవీ రుపొందింది. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

నటీనటుల అభినయమే హైలైట్ గా అలరించిన సీత
మొత్తం మీద చూసుకుంటే రెండేళ్ల గ్యాప్ తరువాత తేజ నుండి వచ్చిన 'సీత' రెండున్నర గంటల ఎంటర్టైన్మెంట్ కు డోకా లేని డిఫరెంట్ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పవచ్చు.

తాప్సీ గేమ్ ఓవర్ మూవీ రిలీజ్ త్వరలో
ఝుమ్మంది నాదం మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన తాప్సీ పన్ను, కోలీవుడ్ లో ఆడుకాలం మూవీ తో, బాలీవుడ్ లో చష్మే బద్దూర్ మూవీ తో పరిచయమయ్యారు. పింక్ హిందీ మూవీకి రైజింగ్ స్టార్ గా గోల్డెన్ రోజ్ అవార్డ్ అందుకున్నారు. తాప్సీ హిందీ లో నటించిన నామ్ షబానా, జు డ్వా 2 , సూర్మా, ముల్క్, బధ్లా మూవీస్ ఘనవిజయం సాధించాయి.

అఖిల్ కొత్త చిత్రం ప్రారంభం
కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ చైల్డ్ యాక్టర్ గా నటించిన సిసింద్రీ మూవీ కి బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. VV వినాయక్ దర్శకత్వం లో అఖిల్ మూవీ ద్వారా హీరో గా టాలీవుడ్ కు పరిచమయ్యారు. అఖిల్ నటించిన అఖిల్, హలో, Mr మజ్ను మూవీస్ పరాజయంపాలయ్యాయి. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నటించే అవకాశం కలిగింది .

ఇబ్బంది లో తమిళ మూవీ వర్మ (అర్జున్ రెడ్డి )
సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి మూవీ హిందీ, తమిళ భాషలలో రీమేక్ అయింది. సందీప్ వంగ దర్శకత్వం లో షాహిద్ కపూర్ హీరో గా హిందీ లో రూపొందిన కబీర్ సింగ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. బాల దర్శకత్వం లో స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా వర్మ పేరుతో తమిళం లో రూపొందింది. ఫైనల్ అవుట్ ఫుట్ సంతృప్తికరంగా లేకపోవడం తో నిర్మాణ సంస్థ వర్మ మూవీ ని రీషూట్ చేయాలని నిర్ణయించింది.