ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం యువ కథానాయకుడు నాని శైలి. ప్రస్తుతం ఒకవైపు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో నటిస్తూనే… మరోవైపు తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ చిత్రం చేస్తున్నాడు ఈ నేచురల్ స్టార్. అంతేకాదు.. విలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం నాని కాల్షీట్స్ కోసం రెండు ఆసక్తికరమైన కథలు ఎదురు చూస్తున్నాయని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… గత ఏడాది ‘గీతగోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్… తాజాగా నాని కోసం ఓ కథను సిద్ధం చేసాడట. అంతేకాదు… త్వరలోనే నానికి ఈ కథను వినిపించనున్నాడని టాక్. దీన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే అవకాశముందని వినిపిస్తోంది. అలాగే… గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను రూపొందించిన వక్కంతం వంశీ కూడా నేచురల్ స్టార్ కోసం ఓ స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్టు టాక్. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం.ఏదేమైనా… పరశురామ్, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో నాని చేయబోయే చిత్రాలపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.
[subscribe]
[youtube_video videoid=FMwGC9-TIhQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























