ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్ హైదరాబాదీ’ అనేది ట్యాగ్‌లైన్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు. హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసే పూరి… ఈ సినిమాను కూడా తన మార్క్ డైరెక్షన్‌తోనే తెరకెక్కించినట్టు… ఇటీవల విడుదలైన టీజర్‌ను బట్టి అర్ధమవుతోంది. ఇదిలా ఉంటే… కొత్త తరహా కాన్సెప్ట్‌తో సాగే ఈ సబ్జెక్ట్‌లో రామ్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… సుపారీ తీసుకుని ఎంతటి రిస్క్‌నైనా చేసే ఓ రౌడీ పాత్రలో రామ్ కనిపించనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపడానికి కూడా సుపారీ తీసుకుంటాడని… అనంతరం రామ్‌కి ఎదురయ్యే సమస్యలు, ఆటంకాల మధ్య ముఖ్యమంత్రిని చంపాడా? లేదా? అనేదే చిత్ర కథ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగా వచ్చిందని … అసలైన కథ సెకండ్ హాఫ్‌లోనే ప్రారంభం అవుతుందని టాక్. అంతేకాదు… ప్రేక్షకులను ఆసక్తికి గురిచేసే అంశాలతో ఈ సెకండ్ హాఫ్ సాగనుందని… ఈ మూవీని పూరి చాలా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసాడని ఇన్‌సైడ్ టాక్.
మరి కొత్త తరహా కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఇస్మార్ట్ శంకర్
… అటు రామ్‌కు, ఇటు పూరికి ఎటువంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=_KLYon_U6iE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: