రెండో షెడ్యూల్‌కి సిద్ధ‌మ‌వుతున్న `డిస్కో రాజా`

Disco Raja Movie Team Getting Ready For Second Schedule,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Disco Raja Movie Latest News,Disco Raja Movie Shooting Schedule,Ravi Teja New Movie Disco Raja Shooting,Disco Raja Movie Second Schedule Updates
Disco Raja Movie Team Getting Ready For Second Schedule

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేష‌న్‌లో ‘డిస్కో రాజా’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్ద పీట వేస్తూ ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా.. ఈ సినిమాకి సంబంధించిన‌ రెండో షెడ్యూల్ బుధ‌వారం నుంచి ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో భాగంగా… హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వచ్చే నెల 21 వరకు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇదిలా ఉంటే… సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి… తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట రవితేజ.

ఆ వివరాల్లోకి వెళితే… గతంలో తనతో ‘డాన్ శీను’, ‘బలుపు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేనితో మరోసారి జట్టు కట్టనున్నాడట ర‌వితేజ‌. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. కాగా… త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన‌ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

[subscribe]

[youtube_video videoid=oFiUUrzcZ2g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + thirteen =