విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో హ‌ను రాఘ‌వ‌పూడి చిత్రం?

Vijay Deverakonda To Work With Hanu Raghavapudi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay Deverakonda and Hanu Raghavapudi To Team Up For Next,Director Hanu Raghavapudi Next With Vijay Deverakonda,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda To Feature With Hanu Raghavapudi
Vijay Deverakonda To Work With Hanu Raghavapudi

వైవిధ్యభరితమైన చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న‌ ఈ టాలెంటెడ్ హీరో కాల్షీట్స్‌ కోసం… పలువురు దర్శకులు కథలతో సిద్ధంగా ఉన్నారు. వారిలో… హను రాఘవపూడి ఒకరు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ‌, ‘లై’, ‘పడి పడి లేచె మనసు’ వంటి చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు హను రాఘవపూడి. రొమాంటిక్ సబ్జెక్ట్స్‌ను బాగా డీల్ చేస్తాడన్న‌ పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు… విజయ్ కోసం మిల‌ట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ డిఫరెంట్ లవ్ స్టోరీనీ రెడీ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు… ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్‌కు త్వరలోనే ఈ కథను వినిపిస్తాడ‌ని తెలుస్తోంది.

కాగా… అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని టాలీవుడ్ టాక్. ఇదివ‌ర‌కు వైజ‌యంతీ మూవీస్ అనుబంధ సంస్థ స్వ‌ప్న సినిమా నిర్మించిన ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, మ‌హాన‌టి చిత్రాల్లో విజ‌య్ కీల‌క పాత్ర‌లు పోషించాడు. మొత్త‌మ్మీద‌… ఈ సంస్థ‌లో విజ‌య్ న‌టించ‌బోయే మూడో సినిమా ఇది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

[youtube_video videoid=7rLcpm71Yw8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + five =