
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 52


NGK మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్

రజినీ సినిమాలో విలన్‌గా మరో బాలీవుడ్ నటుడు?

బంపర్ ఆఫర్ పట్టేసిన ‘ఎఫ్ 2’ భామ?

బిజీ బిజీగా ‘ఛలో’ భామ

తెలుగు దేశం పార్టీ పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్

సిక్స్ ప్యాక్ అబ్స్ తో హీరో సుధీర్ బాబు

మరో ఎంటర్‌టైనర్‌లో వెంకీ?

NGK మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల

తెలుగు తెరకు సరికొత్త గ్లామర్ అద్దిన దర్శకేంద్రుడు

అక్కినేని ఫ్యామిలీ చిత్రం ‘మనం’కు ఐదేళ్ళు

ఉత్తమ స్థాయి లో అడవి శేష్ సినీకెరీర్

విశ్వామిత్ర మూవీ సెన్సార్ పూర్తి

సీత మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

NGK మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీ రాఘవ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా NGK (నంద గోపాల కుమరన్) తమిళ భాష లో రూపొందింది. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ NGK (నంద గోపాల కృష్ణ ) మే 31 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తెలుగు వెర్షన్ మూవీని నిర్మాత KKరాధామోహన్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు.

రజినీ సినిమాలో విలన్‌గా మరో బాలీవుడ్ నటుడు?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలు కేవలం దక్షిణాది ప్రేక్షకులనే కాకుండా… నార్త్ ఆడియన్స్‌నూ అలరిస్తూ ఉంటాయి. అందుకే ఈ మధ్య ఆయన నటించిన సినిమాల్లో బాలీవుడ్ నటులకూ అవకాశం కల్పిస్తున్నారు. రజినీ నటించిన గత మూడు చిత్రాల(‘కాలా’లో నానా పాటేకర్, ‘2.ఓ’లో అక్షయ్ కుమార్, ‘పేట’లో నవాజుద్దిన్ సిద్దికి)ను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంతేకాదు ఈ మూడు సినిమాలలో నటించిన బాలీవుడ్ నటులు ప్రతినాయక పాత్రల్లో కనిపించడం విశేషం. కాగా… ప్రస్తుతం రజినీ, పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కలయికలో రూపొందుతున్న ‘దర్బార్’లో కూడా విలన్ పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటుణ్ణి ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

‘వి’ కోసం స్నేహ ధర్మం పాటించనున్న నాని?
ఇటీవల విడుదలైన ‘జెర్సీ’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఇంటలిజెంట్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ చిత్రంలో నటించనున్నాడు ఈ నేచురల్ స్టార్. ఈ సినిమా నాని కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో… నాని పాత్రను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేసాడంట దర్శకుడు ఇంద్రగంటి.

బంపర్ ఆఫర్ పట్టేసిన ‘ఎఫ్ 2’ భామ?
“హనీ ఈజ్ ద బెస్ట్” అంటూ ‘ఎఫ్ 2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది పంజాబీ జాబిలి మెహరీన్. ప్రస్తుతం… యాక్షన్ హీరో గోపీచంద్, తమిళ డైరెక్టర్ తిరు కాంబినేషన్‌లో రూపొందుతున్న ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ స్టన్నింగ్ బ్యూటీ. అలాగే… నాగశౌర్య హీరోగా నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే… మెహరీన్ ఓ బంపర్ ఆఫర్‌ను తన ఖాతాలో వేసుకున్నట్టు టాలీవుడ్ టాక్.

బిజీ బిజీగా ‘ఛలో’ భామ
రష్మిక మందన్న… ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్‌లో తొలి అడుగులు వేసిన కన్నడ బ్యూటీ. తొలి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్న ఈ భామ… తన సెకండ్ తెలుగు ఫిల్మ్ ‘గీత గోవిందం’తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అనతికాలంలోనే దక్షిణాదిన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకున్న రష్మిక… ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

అన్నపూర్ణ స్టూడియోలో ప్రభాస్ ఆటా పాటా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ట్రైలింగ్వల్ మూవీకి సంబంధించి… చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

కోలీవుడ్ లో ఎంట్రీ కి రెడీ - బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందిన సీత మూవీ ఈ రోజు రిలీజయింది. అల్లుడు శీను,స్పీడున్నోడు , జయ జానకి నాయిక, సాక్ష్యం, కవచం వంటి మూవీస్ లో మాస్ హీరో గా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ తన మాస్ అవతార్ ను పక్కకు పెట్టి సీత మూవీ లో నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ లో నటించారు.

తెలుగు దేశం పార్టీ పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్
వివాదాస్పద ట్వీట్స్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు దేశం పార్టీ పై ట్వీట్ చేశారు. తెలుగు దేశం పార్టీ 1982 సంవత్సరం మార్చి నెల 29 వ తేదీ ఆరంభమయిందని , 2019 సంవత్సరం మే నెల 23 వ తేదీ అంతమయిందని , అంతమవడానికి కారణం అబద్ధాలు, వెన్నుపోటు, లంచగొండితనం , అసమర్ధత, నారా లోకేష్ , YS జగన్ అని ట్వీట్ చేశారు.

సిక్స్ ప్యాక్ అబ్స్ తో హీరో సుధీర్ బాబు
సూపర్ హిట్ మూవీ ఏ మాయ చేసావె తో నటుడు గా టాలీవుడ్ కు పరిచయమైన సుధీర్ బాబు, శివ మనసులో శృతి మూవీ ద్వారా హీరోగా మారారు. ప్రేమకథాచిత్రమ్ మూవీ తో విజయం సాధించారు. సమ్మోహనం, నన్ను దోచుకుందువటే వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీ స్టారర్ V మూవీ రూపొందనుంది. ఆ మూవీ లో నాని తో కలసి సుధీర్ బాబు నటిస్తున్నారు. పుల్లెల గోపిచంద్ బయోపిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరో ఎంటర్‌టైనర్‌లో వెంకీ?
ఎఫ్ 2తో కామెడీ టైమింగ్‌లో తనకు తిరుగులేదని మరోసారి వెండితెర సాక్షిగా చాటాడు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం తను నటిస్తున్న మరో మల్టీస్టారర్ మూవీ వెంకీమామలో కూడా హ్యూమర్ టచ్ ఉన్న పాత్రనే చేస్తున్నాడు వెంకీ. అంతేకాదు.. ఈ సినిమా తరువాత చేయనున్న కొత్త చిత్రంలోనూ కామెడీకే పెద్ద పీట వేస్తున్నాడట ఈ సీనియర్ హీరో.

NGK మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల
డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా తమిళం లో రూపొందిన NGK (నంద గోపాల కుమరన్ ) మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ NGK (నంద గోపాల కృష్ణ )మే 31వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథా నాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

వెంకటేష్ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ కు 23 ఏళ్ళు
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా పలు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ఒకటి. ‘అబ్బాయిగారు’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత వెంకీ, దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. అలాగే హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వెంకటేష్, సౌందర్య కాంబినేషన్‌లో వచ్చిన తొలి సూపర్ హిట్ మూవీ ఇది. అంతకుముందు సూపర్ పోలీస్‌లో నటించిన ఈ ఇద్దరూ… ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు తరువాత పవిత్ర బంధం, పెళ్ళిచేసుకుందాం, రాజా, జయం మనదేరా, దేవీపుత్రుడు చిత్రాల్లో జంటగా నటించి అలరించారు. వినీత మరో కథానాయికగా నటించిన ఈ సినిమాలో కోట…

తెలుగు తెరకు సరికొత్త గ్లామర్ అద్దిన దర్శకేంద్రుడు
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. అలాంటి ప్రపంచానికి సరికొత్త సొబగులు అద్దిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. గ్లామర్‌ని తన గ్రామర్‌గా చేసుకుని స్టార్ డైరెక్టర్‌గా రాణించిన వైనం ఈ దర్శకేంద్రుడి సొంతం. అందుకే… సమ్మోహనపరిచే ఆయన దర్శకప్రతిభకు వెండితెర సైతం మురిసిపోయింది. కమర్షియల్ సినిమాకి కొత్త అర్థం చెపుతూనే… అందులో అన్ని రకాల భావోద్వేగాలకు చోటివ్వడం రాఘవేంద్రరావు ప్రత్యేకత. అలాగే… ప్రతీ ఫ్రేమ్‌ని ఒక పెయింటింగ్‌లా తీర్చిదిద్దడంలో ఆయన శైలే వేరు. ఇక పాటలను ఆయన ఆవిష్కరించే విధానం… పలువురు దర్శకులకు స్ఫూర్తిగా నిలచింది.

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటనాప్రస్థానానికి 33 ఏళ్ళు
అక్కినేని నాగార్జున… తెలుగు తెర మన్మథుడు. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడుగా తెరంగేట్రం చేసినా… అనతి కాలంలోనే కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగ్. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని తన అభినయ సమేతంగా సంపాదించుకున్నారాయన. అలాగే ప్రయోగాలకు చిరునామాగా నిలుస్తూ… పలువురు కొత్త దర్శకులకు తొలి అవకాశాలిచ్చి ప్రోత్సహించిన వైనం నాగ్ సొంతం. కేవలం తెలుగు చిత్రాలకే పరిమితం కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అన్యభాషా ప్రేక్షకులను కూడా మురిపించారు. అలాగే రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ…

అక్కినేని ఫ్యామిలీ చిత్రం ‘మనం’కు ఐదేళ్ళు
ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు కలసి నటించడం అరుదైన విషయమనే చెప్పాలి. హిందీనాట కల్ ఆజ్ ఔర్ కల్ (1971) పేరుతో రూపొందిన చిత్రంలో పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, రణధీర్ కపూర్… ఇలా మూడు తరాల నటులు కలసి నటించి భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. కట్ చేస్తే… 43 ఏళ్ళ తరువాత తెలుగునాట కూడా ఈ తరహా చిత్రం రూపొందింది. అదే… ‘మనం’. అయితే… కల్ ఆజ్ ఔర్ కల్ తరహాలో తాత, తండ్రి, మనవడు కథలా కాకుండా ఓ వినూత్న కోణంలో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఇంకా చెప్పాలంటే… నిజ జీవితంలోని తండ్రీ కొడుకులు వెండితెరపై రివర్స్ వెర్షన్‌లో…

రాంగి తమిళ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అందాల తార త్రిష నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ తమిళ మూవీ రాంగి రూపొందుతుంది. ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శరవణన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంగి తమిళ మూవీ రూపొందుతుంది.

ఉత్తమ స్థాయి లో అడవి శేష్ సినీకెరీర్
ఉత్తమ దిశ లో సాగుతున్న సినీకెరీర్ ను రైటర్, హీరో అడవి శేష్ ఎంజాయ్ చేస్తున్నారు. అడవి శేష్ నటించిన క్షణం, అమీ తుమీ, గూఢచారి మూవీస్ ఘనవిజయం సాధించాయి. అడవి శేష్ హీరోగా నిర్మాత అనిల్ సుంకర గూఢచారి 2 మూవీ ని అనౌన్స్ చేశారు. సోనీ అసోసియేషన్ తో మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మేజర్ మూవీ రూపొందనుంది.

విశ్వామిత్ర మూవీ సెన్సార్ పూర్తి
గీతాంజలి వంటి సక్సెస్ ఫుల్ మూవీ దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో నందిత రాజ్ ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ థ్రిల్లర్ విశ్వామిత్ర మూవీ జూన్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ మూవీప్రేమకథా చిత్రమ్ తో నందిత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.నిజ సంఘటన ఆధారంగా రూపొందిన విశ్వామిత్ర మూవీ లో ప్రసన్న, సత్యం రాజేష్, అశుతోష్ రాణా,విద్యుల్లేఖ రామన్ ముఖ్య పాత్రలలో నటించారు.

మూడు వారాల గ్యాప్‌లో రానున్న దేవరకొండ బ్రదర్స్?
విజయ్ దేవరకొండ… అనతికాలంలోనే స్టార్‌డమ్ పొందిన నేటితరం కథానాయకుడు. ఏ ఏడాదికేడాది తన స్థాయిని పెంచుకుంటూ తారాపథంలో దూసుకుపోతున్నాడీ యూత్ ఐకాన్. అంతేకాదు… తను ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే తన కుటుంబం నుంచి మరో టాలెంటెడ్ హీరోని తెలుగు పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాడు విజయ్. ఆ టాలెంటెడ్ హీరో మరెవరో కాదు… విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. అంతేకాదు… ఈ అన్నదమ్ముల చిత్రాలు ఒకే నెలలో మూడు వారాల గ్యాప్‌లో రిలీజ్ కాబోతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.