
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 5

‘కేజీఎఫ్’ డైరెక్టర్‌తో మహేష్?

సామాజిక కథాంశంతో సాయి తేజ్, దేవ కట్టా సినిమా
మరో థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్

కాంబినేషన్ రిపీట్...?

గోపీచంద్ 'చాణక్య' టీజర్ రిలీజ్

వాల్మీకి మూవీ ట్రైలర్ రిలీజ్

చైతు - సాయి పల్లవి సినిమా షూటింగ్ ప్రారంభం

మీడియా సమావేశంలో నాని స్పందన

ఇంతకంటే ఎక్కువ ఊహించగలరా..!

NANI'S గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
వైజయంతీ మూవీస్ సంస్థలో నందినీ రెడ్డి చిత్రం?
వరుణ్ తేజ్‌తో యూవీ క్రియేషన్స్ చిత్రం?
గద్దల కొండ గణేష్‌గా వరుణ్ తేజ్

మరో మాస్ ఎంటర్‌టైనర్‌లో రామ్!?

టాప్10 తెలుగు చిత్రాలలో 4వ స్థానంలో ‘సాహో’

యన్టీఆర్ ‘కలసివుంటే కలదుసుఖం’కు 58 ఏళ్ళు

రాజ్ తరుణ్ కొత్త సినిమా టైటిల్
KK రాధామోహన్ నిర్మాణ సారథ్యంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా, గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందనున్న మూవీ కి ఒరేయ్ .. బుజ్జిగా టైటిల్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. షాలిని పాండే హీరోయిన్ కాగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తారు. ఐదు సంవత్సరాల తరువాత దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఒరేయ్ .. బుజ్జిగా మూవీ కి దర్శకత్వం వహించడం విశేషం.
‘కేజీఎఫ్’ డైరెక్టర్‌తో మహేష్?
‘కేజీఎఫ్’... ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం... ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ 2’ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు ప్రశాంత్. ఇదిలా ఉంటే... ‘కేజీఎఫ్’తో ఆకట్టుకున్న ప్రశాంత్‌తో సినిమాలు చేయడానికి టాలీవుడ్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ యన్టీఆర్ ఓ డ్యాన్స్ బేస్డ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా... తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ యాక్షన్ డ్రామా చేయడానికి పచ్చ జెండా ఊపినట్లు తెలిసింది.

సామాజిక కథాంశంతో సాయి తేజ్, దేవ కట్టా సినిమా
‘ప్రస్థానం’ (2010)తో ఆకట్టుకున్న దర్శకుడు దేవ కట్టా. ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. కట్ చేస్తే... తాజాగా అదే చిత్రాన్ని హిందీలోనూ 'ప్రస్థానం' పేరుతోనే రీమేక్ చేసాడు దేవ. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ డ్రామా ఈ నెల(సెప్టెంబర్) 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్
సినిమా హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు యాంగ్రీ హీరో రాజశేఖర్. ఇటీవలే సస్పెన్స్ థ్రిల్లర్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ శేఖర్.. ఎప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో రాబోతున్నాడు. క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై జి. ధనుంజయన్ నిర్మాణంలో రాజశేఖర్ ఓ సినిమాకు కమిటయినట్టు గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు డైరెక్టర్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కిస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి…

కాంబినేషన్ రిపీట్...?
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఎవడే సుబ్రమణ్యం సినిమా తో టాలీవుడ్ లో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం ఆయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడట. అందుకే ఈ సినిమాకు 'ఫైటర్' అనే టైటిల్ ను పెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గోపీచంద్ 'చాణక్య' టీజర్ రిలీజ్
తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో 'చాణక్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

వాల్మీకి మూవీ ట్రైలర్ రిలీజ్
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ వాల్మీకి మూవీ సెప్టెంబర్ 20వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈ మూవీ లో పూజ హెగ్డే కథానాయిక. తమిళ హీరో అథర్వ మురళి ఒక ముఖ్య పాత్రలో నటించారు. మిక్కీ J మేయర్ సంగీతం అందించారు. సూపర్ హిట్ తమిళ మూవీ జిగర్తాండ కు తెలుగు రీమేక్ గా వాల్మీకి రూపొందింది.

కార్తికేయ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
ఆర్ఎక్స్ 100 తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో కార్తికేయ. తర్వాత వచ్చిన హిప్పీ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన కార్తికేయ 'గుణ 369' సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇదిలా ఉండగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా మరో సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కార్తికేయ సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాను కూడా 'ఆర్ ఎక్స్100' సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

చైతు - సాయి పల్లవి సినిమా షూటింగ్ ప్రారంభం
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో జరుపుకుంది ఈ సినిమా. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించారు చిత్ర యూనిట్. హైదరాబాద్ లో ఈ రోజు షూటింగ్ ను ప్రారంభించారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నాడు.

మీడియా సమావేశంలో నాని స్పందన
విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన NANI'S గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13 తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఆ మూవీ ప్రమోషన్స్ లో మీడియా కు ఇంటర్వ్యూస్ ఇస్తూ హీరో నాని బిజీగా ఉన్నారు. మీడియా అడిగే ప్రశ్నలకు ఎలా రెస్పాండ్ కావాలోతెలియడం లేదని నాని అన్నారు.

ఇంతకంటే ఎక్కువ ఊహించగలరా..!
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా సాహో. ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా కలెక్షన్స్ కు మాత్రం ఏమాత్రం ఢోకా లేదు. ఈ సినిమా ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 80 కోట్ల షేర్ ను సాధించింది.

NANI'S గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ NANI'S గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ 13వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కాగా లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లో హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

నార్త్ అమెరికా 2019 టాప్ 10 మూవీస్ లో 4వ స్థానం
నార్త్ అమెరికా 2019 బాలీవుడ్ టాప్ 10 మూవీస్ లో సాహో మూవీ 4వ స్థానం లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. రణవీర్ సింగ్ గల్లీ బాయ్ మొదటి , విక్కీ కౌశల్ ఉరి సర్జికల్ స్ట్రైక్ రెండవ , అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ మూడవ , ప్రభాస్ సాహో నాల్గవ , సల్మాన్ ఖాన్ భారత్ ఐదవ , షాహిద్ కపూర్ కబీర్ సింగ్ ఆరవ , వరుణ్ ధావన్ కళంక్ఏడవ , రజనీకాంత్ పేట్ట ఎనిమిదవ , హృతిక్ రోషన్ సూపర్ 30 తొమ్మిదవ , వెంకటేష్ F2 (హిందీ డబ్బింగ్ )పదవ స్థానాలలో నిలిచాయి
వైజయంతీ మూవీస్ సంస్థలో నందినీ రెడ్డి చిత్రం?
‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్‌ఫుల్ లేడీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు నందినీ రెడ్డి. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం మరో డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేస్తున్నారని సమాచారం. అంతేకాదు... ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించనుందని టాక్.
వరుణ్ తేజ్‌తో యూవీ క్రియేషన్స్ చిత్రం?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘వాల్మీకి’... ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటూనే... మరోవైపు తన తదుపరి చిత్రానికి ప్రణాళికలు రచిస్తున్నాడట వరుణ్. తాజా సమాచారం ప్రకారం... `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్‌ని ఓకే చేసాడట ఈ మెగా హీరో.
`సరిలేరు నీకెవ్వరు`లో తమన్నా?
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిల్ సుంకర, `దిల్` రాజు, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
గద్దల కొండ గణేష్‌గా వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మాఫియా కామెడీ ఎంటర్‌టైనర్ ‘వాల్మీకి’. వరుణ్‌కి జోడీగా పూజా హెగ్డే నటించిన ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించాడు. తమిళ సినిమా ‘జిగర్తండా’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో... కోలీవుడ్ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా... ఈ సినిమాలో వరుణ్ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా రివీల్ చేశాడు. గద్దల కొండ గణేష్ అలియాస్ గని పేరుతో `వాల్మీకి`లో వరుణ్ సందడి చేస్తున్నాడట. కాగా... ఇప్పటికే టీజర్‌తో ఇంప్రెస్ చేసిన వరుణ్ పాత్రకు సంబంధించిన మరిన్ని విశేషాలను... ఈ రోజు…

మరో మాస్ ఎంటర్‌టైనర్‌లో రామ్!?
‘ఇస్మార్ట్ శంకర్’... ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలచిన చిత్రం. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్... రామ్‌ను మాస్ ఆడియన్స్‌కు బాగా దగ్గర చేసింది. ఈ నేపథ్యంలోనే... తన తదుపరి చిత్రం కూడా మాస్ ఎంటర్‌టైనర్ అయితే బాగుంటుందని రామ్ భావిస్తున్నాడట. తాజా సమాచారం ప్రకారం... మాస్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన దర్శకుడు వి.వి.వినాయక్‌తో... రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేందుకు సిధ్ధపడుతున్నాడని టాలీవుడ్ టాక్.

టాప్10 తెలుగు చిత్రాలలో 4వ స్థానంలో ‘సాహో’
“గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టినోడికే ఓ రేంజ్ ఉంటుంది” అంటూ తాజాగా ‘సాహో’తో సందడి చేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందీ సినిమా. ఇదిలా ఉంటే... ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

యన్టీఆర్ ‘కలసివుంటే కలదుసుఖం’కు 58 ఏళ్ళు
ఎన్టీఆర్, సావిత్రి... తెలుగుతెరపై కనువిందు చేసిన సక్సెస్ ఫుల్ జోడి. వీరిద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘కలసివుంటే కలదుసుఖం’ ఒకటి.