కార్తికేయ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Kartikeya Starrer 90ML First Look Out, 90 ML for RX 100 fame Kartikeya, 90ML First Look Out, Kartikeya New Movie First Look Out, Kartikeya Latest Movie News, Kartikeya Starrer 90ML First Look Released, Kartikeya New Movie Title And First Look Out Now

ఆర్ఎక్స్ 100 తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో కార్తికేయ. తర్వాత వచ్చిన హిప్పీ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన కార్తికేయ ‘గుణ 369’ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇదిలా ఉండగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా మరో సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కార్తికేయ సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాను కూడా ‘ఆర్ ఎక్స్100’ సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. 90 ఎంఎల్ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
 

ఇక హీరో గా చేస్తూనే మరో పక్క విలన్ పాత్రలు కూడా చేస్తున్నాడు కార్తికేయ. తాను విలన్ రోల్ లో నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ఏ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి హీరో గా ఇప్పటివరకు మెప్పించిన కార్తికేయ.. విలన్ గా ఎంత వరకు మెప్పిస్తాడో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − three =