వాల్మీకి మూవీ ట్రైలర్ రిలీజ్

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Varun Tej Valmiki Trailer Out Now,#ValmikiTrailer, Valmiki Movie Updates, Valmiki Official Trailer, Valmiki Telugu Movie Latest News, Valmiki Telugu Movie Trailer, Valmiki Theatrical Trailer

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ వాల్మీకి మూవీ సెప్టెంబర్ 20వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈ మూవీ లో పూజ హెగ్డే కథానాయిక. తమిళ హీరో అథర్వ మురళి ఒక ముఖ్య పాత్రలో నటించారు. మిక్కీ J మేయర్ సంగీతం అందించారు. సూపర్ హిట్ తమిళ మూవీ జిగర్తాండ కు తెలుగు రీమేక్ గా వాల్మీకి రూపొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్మీకి మూవీ లోని వరుణ్ తేజ్ మాస్ లుక్స్ పోస్టర్ లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసి చిత్ర యూనిట్ వాల్మీకి మూవీ పై హైప్ క్రియేట్ చేసింది. వరుణ్ తేజ్ మాస్ లుక్ పోస్టర్స్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. వాల్మీకి మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఆసక్తికర విజువల్స్ తో రూపొందించిన ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండి మూవీ పై అంచనాలను పెంచింది. DJ వంటి కమర్షియల్ హిట్ మూవీ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన వాల్మీకి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 8 =