
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 19


రణరంగం మూవీ సౌండ్ కట్ ట్రైలర్ రిలీజ్

6 మిలియన్ సబ్ స్క్రైబర్స్ తో తెలుగు ఫిల్మ్ నగర్

సాహో మూవీ ట్రైలర్ ప్రభంజనం

కియారా... జూన్ కనెక్షన్

‘వి’ షూటింగ్‌లో జాయిన్ అయిన నేచురల్ స్టార్

మరో రీమేక్‌లో రాజశేఖర్?

రాజ్ తరుణ్ పక్కన మలయాళీ భామ

థాయ్‌లాండ్‌లో బాలయ్య సందడి

‘సాహో’లో ప్రభాస్ పాత్ర పేరు అదేనా?

‘వాల్మీకి’ నైజాం ప్రీ-రిలీజ్ బిజినెస్ డిటైల్స్
'అనుకోని అతిథి'గా హై బ్రీడ్ పిల్ల
సాహో ట్రైలర్ పై మీ అభిప్రాయం?

కిక్కెక్కించే సాహో ట్రైలర్ రిలీజ్

మహేష్ బాబు ‘అతడు’కు 14 ఏళ్ళు

డాక్టర్‌గా కనిపించనున్న కాజల్

‘ఎవరు’... రన్ టైమ్ డిటైల్స్

గాంధీ జయంతి రోజు 'వార్'
ఒక్క హీరో స్క్రీన్ పై ఉంటేనే ఎంతో సందడిగా ఉంటుంది. అలాంటిది ఇద్దరు హీరోలూ.. అందులోనూ హంక్ బాడీస్.. వార్ కు దిగితే.. రెండు కళ్ళూ సరిపోవు అంతే. అలాంటి ఇద్దరు హీరోలు ఇప్పుడు సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.ఆ హీరోలు ఎవరో కాదు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్.

రణరంగం మూవీ సౌండ్ కట్ ట్రైలర్ రిలీజ్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన యాక్షన్ , క్రైమ్ థ్రిల్లర్ రణరంగం మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈ మూవీ లో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికలు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందించారు.రణరంగం మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

6 మిలియన్ సబ్ స్క్రైబర్స్ తో తెలుగు ఫిల్మ్ నగర్
సౌతిండియాలో నెంబర్ వన్ యూట్యూబ్ ఛానెల్ గా వెలుగొందుతున్న తెలుగు ఫిల్మ్ నగర్ 60 లక్షల సబ్ స్క్రైబర్స్ మైలురాయిని చేరుకుంది. టాలీవుడ్ మూవీస్ అప్ డేట్స్ తో ప్రేక్షకులను తెలుగు ఫిల్మ్ నగర్ ఛానెల్ అలరిస్తుంది. తెలుగు ఫిల్మ్ నగర్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో ముందడుగు వేస్తుంది.

సాహో మూవీ ట్రైలర్ ప్రభంజనం
సుజీత్ దర్శకత్వం లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో ఆగస్ట్ 30వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ , మేకింగ్ వీడియోస్, టీజర్, సాంగ్స్ తో హైప్ క్రియేట్ అయిన సాహో మూవీ ట్రైలర్ ను 10వ తేదీ చిత్ర యూనిట్ నాలుగు భాషలలో రిలీజ్ చేసింది. హాలీవుడ్ మూవీస్ ట్రైలర్స్ ను తలదన్నేలా రూపొందిన సాహో ట్రైలర్ కు ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది.

కియారా... జూన్ కనెక్షన్
కియారా అద్వానీ... గ్లామర్ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. హిందీ చిత్రం ‘ఫగ్లీ’(2014)తో కథానాయికగా తొలి అడుగులు వేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఆ తర్వాత ‘ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’(2016)తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి... తొలి తెలుగు చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. అలాగే... ఇటీవల విడుదలైన ‘కబీర్ సింగ్’ (‘అర్జున్ రెడ్డి’ రీమేక్) రూపంలో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

డిఫరెంట్ సబ్జెక్ట్‌తో పూరి, విజయ్ దేవరకొండ మూవీ?
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం క్రాంతిమాధవ్ డైరెక్టోరియల్, ‘హీరో’ చిత్రాలతో ఈ యంగ్ హీరో బిజీగా ఉన్నాడు. అంతేకాదు... `ఇస్మార్ట్` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లోనూ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయనున్నాడట విజయ్.

‘వి’ షూటింగ్‌లో జాయిన్ అయిన నేచురల్ స్టార్
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం `గ్యాంగ్ లీడర్`, `వి` చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె.కుమార్ రూపొందిస్తున్న`గ్యాంగ్ లీడర్` సెప్టెంబర్ 13న విడుదల కానుండగా... ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కిస్తున్న `వి` క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది.

మరో రీమేక్‌లో రాజశేఖర్?
‘గరుడవేగ’ (2017)తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసిన సీనియర్ హీరో రాజశేఖర్... రీసెంట్‌గా ‘కల్కి’తో పలకరించాడు. అయితే`కల్కి` ఆశించిన విజయం సాధించకపోవడంతో... గతంలో తనకు కలిసొచ్చిన రీమేక్ ఫార్ములాని మరోసారి నమ్ముకుంటున్నాడట రాజశేఖర్. ఈ నేపథ్యంలోనే... ఓ కన్నడ మూవీ రీమేక్‌లో నటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడని సమాచారం.

`ప్రతీ రోజు పండగే` కోసం సాయితేజ్ సిక్స్ ప్యాక్?
తెలుగునాట సిక్స్ ప్యాక్ ఓ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ఈ జాబితాలో మెగాహీరో సాయితేజ్ కూడా చేరనున్నాడని సమాచారం.

రాజ్ తరుణ్ పక్కన మలయాళీ భామ
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ మళ్ళీ వరుస సినిమాలు తో వచ్చేస్తున్నాడు. గుండె జారి గల్లంతయ్యిందే ఫేం కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

థాయ్‌లాండ్‌లో బాలయ్య సందడి
`జై సింహా` తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక నాయికలుగా నటిస్తుండగా... భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘సాహో’లో ప్రభాస్ పాత్ర పేరు అదేనా?
“గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టినోడికే ఓ రేంజ్ ఉంటుంది” అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రంతో సిక్స్(బ్లాక్‌బస్టర్) కొట్టడానికి సిద్ధపడుతున్నాడు. ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన ట్రైలర్ శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ ట్రైలర్... ‘సాహో’ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తోంది.

‘వాల్మీకి’ నైజాం ప్రీ-రిలీజ్ బిజినెస్ డిటైల్స్
`ఎఫ్ 2` వంటి ఘనవిజయం తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి వస్తున్న చిత్రం `వాల్మీకి`. తమిళనాట ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అధర్వ మురళి ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.
'అనుకోని అతిథి'గా హై బ్రీడ్ పిల్ల
వివేక్ దర్శకత్వంలో సాయి పల్లవి, ఫహాద్ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అథిరన్’ మూవీ సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎ.కె. కుమార్, జి. రవికుమార్ తెలుగులో అనువదిస్తున్న సంగతి కూడా విదితమే. తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ చిత్రానికి 'అనుకోని అతిథి' అని టైటిల్ పెట్టారు.
సాహో ట్రైలర్ పై మీ అభిప్రాయం?
మొత్తానికి సాహో ట్రైలర్ వచ్చేసింది. ఇక సోషల్ మీడియా లో ఏ ట్రైలర్ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీజర్ తోనే కొత్త రికార్డ్స్ సృష్టించిన సాహో.. ట్రైలర్ తో ఇంకెన్ని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడటం తప్ప చేసేది ఏం లేదు. ఇక ట్రైలర్ విషయానికొస్తే అటు యాక్షన్ తో పాటు, కమెడీ, ఎమోషన్, రొమాంటిక్ యాంగిల్ ను కూడా చూపించారు. తెలుగులో ఇప్పటి వరకు విజువల్ గ్రాండియర్స్ ఎలా ఉంటాయో మన దర్శకులు చూపించారు కానీ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు సాహో లో చూపించారు. మనం డే అండ్ నైట్ లాగా.. ఒకటి వస్తే ఇంకొకటి వెళ్ళిపోవాలి.. రెండూ ఎప్పటికీ కలవవు…
2 నిమిషాల 46 సెకండ్ల విజువల్ బుల్లెట్ “ సాహో” ట్రైలర్
సాహూ.... సాహూ... సాహూ... ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా వినిపిస్తున్న రెండక్షరాల టైటిల్ "సాహూ". బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా యాక్టర్ గా ఎదిగిపోయిన ప్రభాస్ తదుపరి చిత్రం "సాహూ" మీద అంచనాల హిమాలయాలు పేరుకుపోయాయి... పెరిగిపోయాయి. అందుకే ఈ సినిమాకు సంబందించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. యూ.వీ. క్రియేషన్స్ పతాకంపై దర్శకత్వంలో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 30 న తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా 5 గంటలకు " సాహు " ట్రైలర్ ను…

కిక్కెక్కించే సాహో ట్రైలర్ రిలీజ్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్న టైమ్ రానే వచ్చింది. ఈ భారీ యాక్షన్ ట్రీట్ చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో, పోస్టర్లతో, పాటలతో అదరగొట్టిన సాహో టీమ్ ఇప్పుడు ట్రైలర్ లో ఈ సినిమా సత్తా ను మరో సారి చూపించింది. అదిరిపోయే భారీ యాక్షన్స్ తో.. గ్రాండ్ విజువల్స్ తో సాహో ట్రైలర్ ఆహో అన్నట్టు ఉంది.

మహేష్ బాబు ‘అతడు’కు 14 ఏళ్ళు
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో క్లాసిక్‌గా నిలచిన చిత్రం ‘అతడు’. అంతేకాదు... ‘నిజం’ తరువాత “ఉత్తమ నటుడు”గా మహేష్‌కు మరోసారి “నంది” పురస్కారాన్ని అందించిన సినిమా ఇది. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో... మహేష్ సరసన త్రిష కథానాయికగా నటించింది. నాజర్, కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, సుధ, గిరిబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, హేమ, సోనూ సూద్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

డాక్టర్‌గా కనిపించనున్న కాజల్
వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న కథానాయిక కాజల్ అగర్వాల్. ‘లక్ష్మీకళ్యాణం’, ‘చందమామ’, ‘మగధీర’, ‘బృందావనం’, ‘Mr.పర్‌ఫెక్ట్’, ‘అ!’, ‘సీత’... ఇలా పలు చిత్రాల్లో అభినయానికి అవకాశమున్న పాత్రల్లో అలరించింది ఈ ఉత్తరాది సోయగం. కాగా... కాజల్ కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘రణరంగం’ పంద్రాగస్టున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకుంది కాజల్.

‘ఎవరు’... రన్ టైమ్ డిటైల్స్
థ్రిల్లర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన కథానాయకుడు అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’ వంటి సక్సెస్‌ఫుల్ థ్రిల్లర్స్ తరువాత శేష్ నుంచి వస్తున్న మరో థ్రిల్లర్ మూవీ ‘ఎవరు’. టాలెంటెడ్ బ్యూటీ రెజీనా కథానాయికగా నటించిన ఈ సినిమాలో... నవీన్ చంద్ర, మురళీ శర్మ ఇతర ముఖ్య భూమికలను పోషించారు. వెంకట్ రామ్‌జీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా నిర్మించింది. అడివి శేష్ గత చిత్రం ‘గూఢచారి’కి సంగీతం సమకూర్చిన శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించాడు.