
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 18


సాహో వీడియో గేమ్ ట్రైలర్ రిలీజ్

60 ఇయర్స్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ

సాహో ఇండియన్ సినిమాలో మరో కొత్త అధ్యయనం

వాల్మీకి మూవీ టీజర్ రిలీజ్ డేట్

నవీన్ పోలిశెట్టి మూవీ టైటిల్ "జాతి రత్నాలు "

బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన సాహో

రవితేజ, రాశీఖన్నా... ముచ్చటగా మూడోసారి?

‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైన్ ఎపిసోడ్ పూర్తి?

అందాల అభినయం... అతిలోక సుందరి శ్రీదేవి

రకుల్... ‘భారతీయుడు 2’ షూటింగ్ టైమ్
త్వరలో బన్నీ టైటిల్ విడుదల
కొత్త దర్శకుడికి మెగా హీరో గ్రీన్ సిగ్నల్
అమీర్ తో సినిమా నిజమే

హ్యాపీ బర్త్ డే

బొమ్మ పడుతుంది - సినిమా కన్ఫామ్

జెర్సీ మూవీ తమిళ రీమేక్ లో హీరోయిన్ ?

అడివి శేష్ కు మాత్రమే అది మినహాయింపు..!
వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న కొత్త సినిమా ఎవరు. ఈ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో రెజీనా, నవీన్ చంద్ర, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగష్ట్ 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాహో వీడియో గేమ్ ట్రైలర్ రిలీజ్
రోజుకో సర్ ప్రైజ్ తో సాహో టీం ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టిన దగ్గరనుండి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే వుంది. ఇప్పటికే టీజర్, పాటలు, యాక్షన్ పోస్టర్స్, రెండు రోజుల క్రితం ట్రయిలర్ ను రిలీజ్ చేసింది. ఇంకా ఆ ట్రైలర్ మూడ్ లో నుండి ఇంకా బయటకు రాకముందే... మళ్ళీ ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది.

60 ఇయర్స్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ
లెజండరీ యాక్టర్, డాన్సర్, రైటర్, సింగర్, లిరిసిస్ట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, పొలిటీషియన్ కమల్ హాసన్ చిత్ర పరిశ్రమలో 60 సంవత్సరాల సక్సెస్ ఫుల్ జర్నీసందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కమల్ హాసన్ పై ప్రశంసలు కురిపించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషలలో 200 మూవీస్ కు పైగా నటించిన కమల్ హాసన్ కలైమామణి, పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి అత్యుత్తమ పురస్కారాలు అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ గా 19 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకొనడం విశేషం. 1960 సంవత్సరం కలత్తూర్ కన్నమ్మ మూవీతో బాలనటుడు గా కోలీవుడ్ కు పరిచయమైన కమల్ హాసన్ ఆ మూవీ లో పెర్ఫార్మెన్స్ కు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు.

సాహో ఇండియన్ సినిమాలో మరో కొత్త అధ్యయనం
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ యాక్షన్ కమ్ భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’. ఇక ఈ సినిమా ట్రైలర్ ను మొన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ ఇలా విడుదల అయ్యిందో లేదో అప్పుడే యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. నెంబర్ వన్‌లో ట్రెండింగ్ అవుతూ 70 మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించి పాత రికార్డులు తుడిచేసి.. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ఇంత వరకూ ఇండియన్ స్క్రీన్ పై కనిపించలేదంటే... అతిశయోక్తి కాదు. యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక ప్రభాస్ చెప్పిన 'గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టే వాడికే ఒక…

వాల్మీకి మూవీ టీజర్ రిలీజ్ డేట్
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన కామెడీ యాక్షన్ థ్రిల్లర్ వాల్మీకి మూవీ సెప్టెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. పూజ హెగ్డే కథానాయిక కాగా తమిళ హీరో అథర్వ ఒక కీలక పాత్రలో నటించారు. మిక్కీ J మేయర్ సంగీతం అందించారు. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ జిగర్తాండ కు తెలుగు రీమేక్ వాల్మీకి మూవీ. వరుణ్ తేజ్ ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ గ్యాంగ్ స్టర్ గా నటించడం విశేషం.

నవీన్ పోలిశెట్టి మూవీ టైటిల్ "జాతి రత్నాలు "
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో హీరోగా గుర్తింపు పొందిన నవీన్ పోలిశెట్టి తన తన రెండవ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ మహానటి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాస్ బ్యానర్ పై అనుదీప్ దర్శకత్వం లో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్ జాతి రత్నాలు గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన సాహో
బాహుబలి సినిమా తర్వాత.. ఏ సినిమా రికార్డులు క్రియేట్ చేసినా నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది అనే మాట తప్ప ఇంకేం వినిపించలేదు. బాహుబలి రికార్డులు మాత్రం ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా చెరపలేకపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రభాస్ రికార్డులను తానే బ్రేక్ చేసి.. ఆ క్రెడిట్ తనే దక్కించుకున్నాడు.
కీర్తి సురేష్ మరో థ్రిల్లర్ - ఈసారి ఎమోషనల్ మిస్టరీ
నరేంద్ర అనే కొత్త డైరెక్టర్ తో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహిళలపై జరిగే అకృత్యాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. గతకొద్ధి కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కొనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు 'మిస్ ఇండియా' అనే టైటిల్ ని పెట్టే ఆలోచలో వున్నారు.

మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయితేజ్?
`చిత్రలహరి`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసిన మెగా హీరో సాయితేజ్... ప్రస్తుతం `ప్రతీరోజు పండగే`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే... మరో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. వాటిలో ఒక చిత్రాన్ని `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనుండగా... మరో సినిమాని సుబ్బు అనే నూతన దర్శకుడు రూపొందించనున్నాడని తెలిసింది.

రవితేజ, రాశీఖన్నా... ముచ్చటగా మూడోసారి?
`బెంగాల్ టైగర్`, `టచ్ చేసి చూడు` చిత్రాల్లో జంటగా నటించి అలరించారు మాస్ మహారాజా రవితేజ, అందాల తార రాశీఖన్నా. తాజా సమాచారం ప్రకారం... ఈ ఇద్దరూ ముచ్చటగా మూడోసారి జోడీకట్టనున్నారని తెలిసింది.

‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైన్ ఎపిసోడ్ పూర్తి?
సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో... అలనాటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు.

అందాల అభినయం... అతిలోక సుందరి శ్రీదేవి
పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు రంగరిస్తే వచ్చే ముగ్ధ మనోహరమైన రూపం... అతిలోకసుందరి శ్రీదేవి సొంతం. కేవలం అందానికే కాదు... అందమైన అభినయానికి కూడా చిరునామాగా నిలిచారు శ్రీదేవి. బాలనటిగా భళా అనిపించి... కథానాయికగా కవ్వించి... రెండు విధాలా స్టార్ డమ్ చూసిన శ్రీదేవి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమె నటనాప్రస్థానానికి సంబంధించిన జ్ఞాపకాల్లోకి వెళితే...

రకుల్... ‘భారతీయుడు 2’ షూటింగ్ టైమ్
లోక నాయకుడు కమల్ హాసన్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’(1996) ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కట్ చేస్తే... 23 ఏళ్ళ తరువాత కమల్, శంకర్ కాంబోలో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ఐశ్వర్యా రాజేష్, ప్రియాభవాని శంకర్, విద్యుత్ జమ్వాల్ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
త్వరలో బన్నీ టైటిల్ విడుదల
స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ విషయం లో అప్ డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఆగష్ట్ 15వ తేదీన టైటిల్ ను రిలీజ్ చేయనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మరి ఇదే రోజు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపించాయి. చుద్దాం టైటిల్ ఒక్కటే రిలీజ్ చేస్తారో? లేక టైటిల్ ప్లస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారో?
కొత్త దర్శకుడికి మెగా హీరో గ్రీన్ సిగ్నల్
మొత్తానికి చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. గతంలో చేసిన తప్పులు చేయకుండా సినిమాల ఎంపిక విషయం లో జాగ్రతలు తీసుకుంటున్నాడు. తొందరపడకుండా తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మారుతి డైరెక్షన్ లో ప్రతి రోజు పండగే అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతకొద్ది నెలలుగా షూటింగ్ జరుపుకుంతుండగా.. మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకోనుంది.
అమీర్ తో సినిమా నిజమే
మొత్తానికి అమీర్ ఖాన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వచ్చిన వార్తలకు బ్రేక్ పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం విజయ్ సేతుపతి నటిస్తున్న ‘సంఘ తమిళన్’ సినిమా షూటింగ్ స్పాట్‌కు అమీర్ ఖాన్ వెళ్లడమే.

హ్యాపీ బర్త్ డే
తెలుగు, తమిళ భాషల చిత్రాలకు మ్యూజిక్ కంపోజర్ గా, బ్యాక్ గ్రౌండ్ స్కోరర్ గా పనిచేస్తున్న గిబ్రాన్ కు జన్మ దిన శుభాకాంక్షలు. బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న వాగై సూడ వా మూవీ తో సంగీత దర్శకుడిగా 2011 సంవత్సరంలో కోలీవుడ్ లో ప్రవేశించిన గిబ్రాన్ సంగీతం అందించిన వత్తి కుచ్చి, ఉత్తమ విలన్,పాపనాశం, తూంగవనం , అదే కనగల్, తీరం అధికారం ఒండ్రు, రాట్చసన్ వంటి తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

బొమ్మ పడుతుంది - సినిమా కన్ఫామ్
ఒక హీరో లో ఉన్న హీరోయిజాన్ని పర్ఫెక్ట్ గా చూపించాలంటే అది డాషింగ్ డైరెక్టర్ పూరీ వల్లే సాధ్యమవుతుందని స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో ఎవరంటే టక్కున విజయ్ దేవరకొండ అని చెప్పొచ్చు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటది. సినిమా లవర్స్ కి పండగే కదా..

జెర్సీ మూవీ తమిళ రీమేక్ లో హీరోయిన్ ?
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. క్రికెటర్ గా నాని అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఇప్పుడు ఆ మూవీ తమిళ భాష లో రీమేక్ కానుంది. బహు భాషా నటుడు రానా దగ్గుబాటి నిర్మాణ సారథ్యం లో నెల్సన్V దర్శకత్వంలో రూపొందనుందని సమాచారం.

‘సరిలేరు నీకెవ్వరు' లో అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్
అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇటీవలే మహేష్ బర్త్ డే సందర్భం గా మహేష్ ఇంట్రడక్షన్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.