2 నిమిషాల 46 సెకండ్ల విజువల్ బుల్లెట్ “ సాహో” ట్రైలర్

#SaahoTrailer, 2019 Latest Telugu Film News, 2019 Telugu Trailers, Prabhas Saaho, Prabhas Saaho Movie Theatrical Trailer Out Now, Prabhas Saaho Movie Trailer, Prabhas Saaho New Movie Trailer Out, Prabhas Saaho Trailer Out, Prabhas Starrer Saaho Trailer Out, Prabhas Takes Off Your Breath With His Exploits In Saaho Trailer, Saaho Movie Latest Updates, Saaho Movie Official Trailer, Saaho Movie Theatrical Trailer, Saaho Movie Trailer, Saaho Telugu Movie Trailer, Saaho Theatrical Trailer Out Now, Saaho Trailer, Saaho Trailer Out, Saaho Trailer Released Prabhas Takes Your Breath Away With His Exploits, Saaho Trailer Review, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

సాహూ…. సాహూ… సాహూ… ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా వినిపిస్తున్న రెండక్షరాల టైటిల్ “సాహూ”. బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాన్  ఇండియా యాక్టర్ గా ఎదిగిపోయిన ప్రభాస్ తదుపరి చిత్రం “సాహూ” మీద అంచనాల హిమాలయాలు పేరుకుపోయాయి… పెరిగిపోయాయి. అందుకే ఈ సినిమాకు సంబందించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. యూ.వీ. క్రియేషన్స్ పతాకంపై దర్శకత్వంలో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 30 న తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా 5 గంటలకు ” సాహు ” ట్రైలర్ ను విడుదల చేశారు. అంటే కొద్ది క్షణాల క్రితమే విడుదలైన ” సాహు” ట్రైలర్ రివ్యూను మీకు అందిస్తుంది మీ ” ద తెలుగు ఫిలిం డాట్ కాం”. గగుర్పాటు కలిగించే యాక్షన్ సీక్వెన్స్ లతో 2 నిమిషాల 46 సెకండ్ల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్  వైల్డ్ ఫైర్ లాగా వైరల్ అవ్వటం చూస్తుంటే సాహుకున్న క్రేజ్ ఏమిటో అర్థమవుతుంది. ముందుగా వైడ్ షాట్ లో నైట్ ఎఫెక్ట్ లో సిటీ అట్మాస్పియర్  చూపించి తరువాత పోలీస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో ” సిటీలో రెండు వేల కోట్ల దోపిడీ జరిగింది ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తున్నాను… అంటాడు ఒక  ఆఫీసర్. ” ఎవరు అతను అంటాడు”- ఇంకొక ఆఫీసర్. అలా అనగానే ప్రభాస్ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. కానీ మురళి శర్మ స్క్రీన్ మీదకు వచ్చి ” అతను ఫీల్ గుడ్ సినిమాకు ముందు వచ్చే స్మోకింగ్ యాడ్ లాంటివాడు… కంటెంట్ కరెక్ట్ గా ఉన్నా విజువల్ చాలా డిస్ట్రబిన్గ్ గా ఉంటుంది సార్ ” అంటాడు. ఆ వెంటనే కొన్ని యాక్షన్ షాట్స్ ఆ తరువాత అదిరిపోయే లెవెల్లో కూల్ గా ప్రభాస్ ఇంట్రో. కొన్ని వైలెంట్ యాక్షన్స్ తరువాత ప్రభాస్ అసిస్టెంట్ తో ” వైలెన్స్ వైలెన్స్…. వైలెన్స్ చాలా ఎక్కువైపోయింది… we want something like… అంటుండగా అసిస్టెంట్ ‘రొమాన్స్’… అంటాడు. yes… romance.. అంటాడు సాహు. వెంటనే” బేబీ వాంట్ టు టెల్ మీ సంథింగ్”- సాంగ్ విజువల్స్ ప్లే అవుతాయి. ఆ తరువాత” స్పృహ లేకుండా గాయాలతో పడి ఉన్న శ్రద్ధా కపూర్ బాడీని అలా ఈడ్చుకుంటూ వెళ్తుంటాడు ప్రభాస్. దీనంగా శ్రద్ధా కపూర్ ఓ బి వాయిస్ లో “we are just like day and night… అవి ఒకటి వస్తే ఇంకొకటి వెళ్లిపోవాలి…రెండూ ఎప్పుడు కలవవు… మనలాగే…అని వినిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ కు హైలైట్ గా నిలవడమే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్కెక్కించే డైలాగ్ ఒకటుంది. ” గల్లీలో ఎవడైనా సిక్సర్ కొడతాడు… స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది”. ఫాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే మరొక చిన్న సీక్వెన్స్: తనను తాను” అమృతా నాయర్ – క్రైమ్ బ్రాంచ్ అని పరిచయం చేసుకున్న శ్రద్ధా కపూర్ ఒక సీక్వెన్స్ లో ప్రభాస్ గుండె మీద గన్ ఎయిమ్ చేసి ” ఇక్కడ కాల్చడానికి  ఏమీ లేదు… మొత్తం ఇక్కడే ఉంది” అంటూ గన్నును ప్రభాస్ హెడ్ మీదకు షిఫ్టు చేసినప్పుడు ప్రభాస్ ఇచ్చిన స్టైలిష్ ఎక్స్ప్రెషన్ సింప్లీ సూపర్బ్. ఇలా 2 నిమిషాల 46 సెకండ్ల సాహో ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ ఒక విజువల్ వండర్ లాగా ఇంప్రెస్ చేస్తుంది. ఎప్పుడా …ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫాన్స్ కు ఈరోజు నుండి సినిమా రిలీజ్ డేట్ ఆగస్టు 30 వరకు ప్రతిరోజు అంచనాల ఆనందాలే. ఆ తరువాత విజయోత్సవ కేరింతలే…

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.




Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=HNnt00swZ5Q]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here