డాక్టర్‌గా కనిపించనున్న కాజ‌ల్

Kajal Agarwal To Play Doctor Role, 2019 Latest Telugu Film News, Doctor Role To Be played by Kajal agarwal, Kajal Agarwal Latest Movie news, Kajal Agarwal Ropped An Interesting Role In His Next, Kajal Agarwal As Docter In Her Next, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Kajal Aggarwal plays doctor role in Ranarangam movie

వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న కథానాయిక కాజల్ అగర్వాల్. ‘లక్ష్మీకళ్యాణం’, ‘చందమామ’, ‘మగధీర’, ‘బృందావనం’, ‘Mr.ప‌ర్‌ఫెక్ట్’, ‘అ!’, ‘సీత’… ఇలా పలు చిత్రాల్లో అభినయానికి అవకాశమున్న పాత్రల్లో అలరించింది ఈ ఉత్తరాది సోయగం. కాగా… కాజల్ కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘రణరంగం’ పంద్రాగస్టున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకుంది కాజల్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో డాక్టర్‌ పాత్రలో కనిపిస్తానని… కథను ముందుకు నడిపే ఈ పాత్ర ద్వితీయార్థంలో వస్తుందని తెలిపింది కాజల్. అంతేకాదు… ‘అ!’ ఫేమ్ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో నటించనున్న కొత్త చిత్రం నవంబర్ నుంచి పట్టాలెక్కుతుందనీ, అందులో ఛాలెంజింగ్ రోల్ చేయబోతున్నట్టు పేర్కొంది. ఇక ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘భారతీయుడు 2’లో ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నట్టు ముక్తాయించింది కాజల్.

[subscribe]

[youtube_video videoid=d42sa1Du_j4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + fourteen =