
ట్యాగ్ · 15 కథనాలు


టిల్లు స్క్వేర్ కు రికార్డు ఓపెనింగ్స్

టిల్లు స్క్వేర్ యూఎస్ ప్రీ సేల్స్ లో దూకుడు

టిల్లు స్క్వేర్ సెకండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్

టిల్లు స్క్వేర్ సెన్సార్ కంప్లీట్.. రిలీజ్‌కు సిద్ధం

టిల్లు స్క్వేర్ నుండి తప్పుకున్న తమన్

టిల్లు స్క్వేర్ నుండి రానున్న స్నీక్ పీక్

టిల్లు స్క్వేర్ సెకండ్ సింగిల్ రెడీ

టిల్లు స్క్వేర్ విడుదల వాయిదా

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సిద్ధు జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ కన్ ఫర్మ్

డీజే టిల్లు సీక్వెల్ టైటిల్ రిలీజ్

ఓటీటీలోకి వచ్చేసిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అలాగే హారో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్వయంగా కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు.

టిల్లు స్క్వేర్ కు రికార్డు ఓపెనింగ్స్
టిల్లు స్క్వేర్ థియేటర్లలోకి వచ్చేసింది.రివ్యూస్ పాజిటివ్ గా రావడంతోపాటు యూనానిమస్ బ్లాక్ బాస్టర్ అనే మౌత్ టాక్ సొంతం చేసుకుంటుంది.దాంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు మార్నింగ్ ,మ్యాట్నీ షోలకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.ఈరోజు పబ్లిక్ హాలిడే కావడం కూడా సినిమాకు కలిసొచ్చింది.

యూఎస్ఏ లో ప్రీమియర్ సేల్స్ లో అదరగోడుతున్న టిల్లు స్క్వేర్
మరి కొన్ని గంటల్లో ఓవర్సీస్ లో టిల్లు స్క్వేర్ ప్రీమియర్స్ పడనున్నాయి.యూఎస్ఏ లో ఆల్రెడీ ప్రీమియర్ ప్రీ సేల్స్ 200k దాటేశాయి.ఓ యంగ్ హీరోకు ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్ అనే చెప్పొచ్చు.సినిమాకు హిట్ టాక్ వస్తే 1మిలియన్ మార్క్ కేక్ వాక్ కానుంది.ఇక టిల్లు స్క్వేర్ పై సిద్దు ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.రెండు గంటలు నాన్ స్టాప్ గా నవ్వుతారని ప్రమోషన్స్ లో పదే పదే చెపుతున్నారు.నిన్న రిలీజైన సెకండ్ ట్రైలర్ కూడా అందుకు తగ్గట్లే వుంది.

టిల్లు స్క్వేర్ యూఎస్ ప్రీ సేల్స్ లో దూకుడు
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా పలుమార్లు రిలీజ్ డేట్ ను మార్చుకున్నా ఫైనల్ గా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

టిల్లు స్క్వేర్ సెకండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోయాయి. అంతేకాదు సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యార. ఈనేపథ్యంలో తాజాగా సెకండ్ ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. రేపు ఈసినిమా సెకండ్ ట్రైలర్ ను రిలీజ్…

టిల్లు స్క్వేర్ సెన్సార్ కంప్లీట్.. రిలీజ్‌కు సిద్ధం
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్దు సరసన మల్లు బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఇటీవలే రిలీజైన మూడో సాంగ్ 'ఓ మై లిల్లీ' బాగా ఆకట్టుకుంటోంది.

టిల్లు స్క్వేర్ నుండి తప్పుకున్న తమన్
మచ్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఈనెల 29న థియేటర్లలోకి వస్తుంది.డీజే టిల్లు ఊహించని విధంగా సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ ఫై అంచనాలు భారీగా వున్నాయి.ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా హైప్ తగ్గేట్లే వుంది.ఈసినిమాకు రామ్ మిరియాల,అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.ఇంతకుముందు విడుదలచేసిన రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా నిన్న మూడో సాంగ్ ఓ మై లిల్లీని రిలీజ్ చేశారు.

టిల్లు స్క్వేర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది డీజే టిల్లు సినిమా. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈసినిమాలోని డైలాగ్స్, సాంగ్స్, టిల్లు యాటిట్యూడ్ అన్నీ సినిమాకు హైలెట్ నిలిచి సంచలన విజయం అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా సిద్దూ నటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

టిల్లు స్క్వేర్ నుండి రానున్న స్నీక్ పీక్
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా పలుమార్లు రిలీజ్ డేట్ ను మార్చుకున్నా ఫైనల్ గా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టికెట్టే కొనకుండా అనే పాటను అలానే రాధిక అనే పాటను రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

టిల్లు స్క్వేర్ సెకండ్ సింగిల్ రెడీ
మచ్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ నుండి మరో సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇంతకుముందు ఈసినిమా నుండి మొదటి పాట టిక్కెట్టే కొనకుండా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఇప్పుడు రెండో పాటను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.సాంగ్ కూడా రెడీ అయిపోయిందట.త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ కానుంది.ఈసందర్భంగా సినిమా నుండి సిద్దు పోస్టర్ ను రిలీజ్ చేసి ఈ అప్డేట్ ఇచ్చారు.

టిల్లు స్క్వేర్ విడుదల వాయిదా
బ్లాక్ బాస్టర్ డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం టిల్లు స్క్వేర్. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు.ఈసినిమాఫై మంచి అంచనాలు వున్నాయి.అయితే ఇంతకుముందు ఈసినిమాను సెప్టెంబర్ 15న విడుదలచేయాలని మేకర్స్ భావించారు.ఈ డేట్ ను అఫీషియల్ గా కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి విడుదలచేయలేకపోతున్నారు.దాంతో విడుదల వాయిదా పడింది.

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్
యువ హీరో సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో నటించిన డీజే టిల్లు అనూహ్యవిజయాన్ని సాధించింది. ఈసినిమాలో సిద్దు యాక్టింగ్ యూత్ ను ఫిదా చేసింది.దాంతో డీజే టిల్లు బాక్సాఫీస్ ను షేక్ చేసింది.ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.టిల్లు స్క్వేర్ టైటిల్ తో వస్తున్న ఈసీక్వెల్ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుటుంది.ఇందులో సిద్దు సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.డీజే టిల్లు ను విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.

సిద్ధు జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ కన్ ఫర్మ్
తమిళ, తెలుగు, మలయాళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా అనుపమ కొనసాగుతున్నారు. అనుపమ కథానాయికగా తెరకెక్కిన కార్తికేయ 2, 18 పేజెస్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. అనుపమకు కార్తికేయ 2 మూవీ ఒక అద్భుతమైన బ్రేక్ ఇచ్చి, అనుపమ కెరీర్ కు ప్లస్ అయ్యింది. అనుపమ ప్రస్తుతం సైరెన్ (తమిళ ), టిల్లు స్క్వేర్ (తెలుగు ), ఒక మలయాళ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు.

నైజాం లో టిల్లు స్క్వేర్ మూవీ రైట్స్ కు భారీ డిమాండ్
సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన డీజే టిల్లు. ఈసినిమా 2022 ఫిబ్రవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో సిద్దు జొన్నలగడ్డ తన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిన్న సినిమా భారీ విజయాన్ని సాధించడం విశేషం. ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

డీజే టిల్లు సీక్వెల్ టైటిల్ రిలీజ్
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టే సినిమాలు కొన్ని ఉంటాయి. చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద సినిమాలుగా హిట్ అయినవి చాలా ఉన్నాయి. ఈమధ్య కాలంలో అలా వచ్చిన సినిమా డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకి, యూత్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ తన టైమింగ్ తో బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా అందించింది.