
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 63


స్పెషల్ డేన రానున్న ‘మన్మథుడు 2’?


‘సాహో’ హిందీ వెర్షన్ కోసం ప్రభాస్ డబ్బింగ్?

‘మన్మథుడు 2’ పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి

టైటిల్ అన్వేషణలో శర్వానంద్ చిత్రం

ఈ నెల 15న ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్

`రూలర్`గా బాలకృష్ణ?


మహర్షి మూవీ తో కల్కి కమర్షియల్ ట్రైలర్
మన హీరోల 25 సినిమాల ల్యాండ్ మార్క్

జోరు పెంచిన యువ హీరోలు
మే 9... కేరాఫ్ బ్లాక్ బస్టర్స్

హిప్పీ మూవీ ట్రైలర్ విడుదల

‘దబాంగ్ 3’లో సౌత్ ఫ్లేవర్

డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవికి హ్యాపీ బర్త్‌డే

తమన్ ఖాతాలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్
గత ఏడాది ‘భాగమతి’, ‘తొలిప్రేమ’, ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి పలు విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించిన తమన్… ఈ ఏడాది ‘మజిలీ’ వంటి ఫ్యామిలీ ఎమెషనల్ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో… తాజాగా మరో ఫ్యామిలీ ఎమోషనల్ మూవీకి సంగీత దర్శకుడిగా పని చేసే అవకాశం తమన్‌ని వరించిందని సమాచారం.

స్పెషల్ డేన రానున్న ‘మన్మథుడు 2’?
కింగ్ నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన్మథుడు 2’. స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ అతిథి పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా పోర్చుగల్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం… మే 21 నుంచి హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ను జరుపుకోనుంది.
సొంత సినిమాల ఇంటి భోజనం చేస్తున్న టాప్ స్టార్స్
టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరికీ సొంత బ్యానర్స్ ఉన్నాయి. రెగ్యులర్ గా బయట నిర్మాతలకు సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు తమ అభిరుచికి అనుగుణంగా సొంత బ్యానర్లో సినిమాలు తీసుకుంటూ ఉంటారు అగ్ర హీరోలు. ఇది అనాది నుండి జరుగుతున్న ప్రాక్టీస్. హీరోలుగా కెరీర్ ప్రారంభ దశలోనే సొంత నిర్మాణ సంస్థలు ప్రారంభించి సినిమాలు తీసుకుంటూ అద్భుత విజయాలను అందుకున్నారు మన హీరోలు.1944లో హీరో అయిన అక్కినేని నాగేశ్వరరావు ప్రముఖ నటి అంజలీ దేవి, ఆమె భర్త ఆదినారాయణరావులతో భాగస్వామ్యం కలిసి కొన్ని సినిమాలు నిర్మించారు.

విద్యారంగంలోకి చిరంజీవి- ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు- - చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామి నాయుడు
నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం అంతర్జాతీయ స్థాయిలో పాదయాత్ర చేసి వస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. విషయం పాజిటివ్ ఐనప్పటికీ అది అవాస్తవం అయినప్పుడు విన్న వాళ్లకు, చదివిన వాళ్లకు చిర్రెత్తుకొస్తుంది. ఇప్పుడు అలాంటి అవాస్తవ ప్రచారం ఒకటి విపరీతంగా గా చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ విద్యారంగంలోకి ప్రవేశించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో " చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్" ప్రారంభించబోతున్నారు అన్నదే ఆ వార్త. ఇది పక్కా ఫేక్ న్యూస్. అయితే అధికారిక వార్తను ప్రచురించినoత సాధికారికంగా ఈ ఫేక్ న్యూస్ ను ప్రచురించి ప్రచారం చేస్తున్నాయి కొన్ని మీడియా వర్గాలు. అసలు ఆ ప్రతిపాదనే లేని చిరంజీవి…

‘సాహో’ హిందీ వెర్షన్ కోసం ప్రభాస్ డబ్బింగ్?
తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకుంటే… ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం జరగడమే కాకుండా… ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరవ్వొచ్చు. అందుకే ఈ మధ్య డబ్బింగ్ చెప్పుకోవడానికి చాలా మంది తారలు అమితాసక్తి చూపిస్తున్నారు. ఇంతవరకు ఈ జాబితాలో కథానాయికలనే చూసాం. కాని ఇప్పుడు ఓ స్టార్ హీరో చేరబోతున్నాడు.

‘మన్మథుడు 2’ పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి
కింగ్ నాగార్జున, స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా… తాజాగా పోర్చుగల్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. దాదాపు ఐదు వారాల పాటు నిరవధికంగా జరిగిన ఈ షెడ్యూల్లో నాగ్, రకుల్, ‘వెన్నెల’ కిషోర్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా.. స్వల్ప విరామం తీసుకుని హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని టాక్.

టైటిల్ అన్వేషణలో శర్వానంద్ చిత్రం
యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్లో ఓ గ్యాంగ్ స్టర్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లవర్ బాయ్‌గా, ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్‌గా… ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో శర్వానంద్ నటిస్తుండగా… అతనికి జోడీగా కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మిలియన్ డాలర్ల క్లబ్లో.. మహేష్ నయా రికార్డు
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా… ఇటు అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను కూడా విశేషంగా అలరిస్తోంది. అంతేకాదు… బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల పంట పండిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… ఓవర్సీస్లోనూ మరోసారి సత్తా చాటుతున్నాడు మహేష్. శనివారం నాటికి మహర్షి 1 మిలియన్ డాలర్ క్లబ్లో చేరడంతో… టాలీవుడ్ నుంచి ఈ క్లబ్లో చేరిన తొలి ట్రిపుల్ హ్యాట్రిక్ హీరోగా మహేష్ చరిత్ర సృష్టించాడు.

ఈ నెల 15న ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తొలి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్… తాజాగా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా నాలుగు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. వీటిలో రెండు పాటలను త్వరలోనే విదేశాల్లో చిత్రీకరించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందట.

మదర్ సెంటిమెంట్‌తో మెప్పించిన మూడు తరాల అగ్ర కథానాయకులు
సృష్టిలో ఓంకారాన్ని మించిన అద్భుతమైన మాట “అమ్మ”. ఆ దైవాన్ని మించిన దైవం “అమ్మ”. తన ఆయువునే ఆరో ప్రాణంగా మలచి జన్మనిచ్చే మాతృమూర్తి “అమ్మ”… ఇలా చెప్పుకూంటూ పోతే… “అమ్మ” అనే మాటకు పర్యాయపదాలు ఎన్నో ఎన్నెన్నో. “అమ్మ” గురించి చెప్పాలంటే భాష చాలదు. చెప్పాలన్న ఆశ ఆగదు. కాని “అమ్మ”కు సాటి ఈ సృష్టిలోనే లేదు అన్నది మాత్రం అక్షర సత్యం. అంతటి ప్రాముఖ్యత కలిగిన “అమ్మ” పాత్ర నిజ జీవితంలోనే కాదు… సినిమాల్లోనూ రమణీయం, కమనీయం, చిరస్మరణీయం. అందుకే… వెండితెరపై “అమ్మ” సెంటిమెంట్‌తో పలు సినిమాలు రూపొందాయి. ఘనవిజయం సాధించాయి. ఇందుకు స్టార్ హీరోలు కూడా మినహాయింపు కాదు. మదర్స్ డే సందర్భంగా మూడు…

అద్భుత ప్రణయ దృశ్యకావ్యం ‘గీతాంజలి’కి మూడు దశాబ్దాలు
కొన్ని సినిమాలు కళ్ళను తాకితే… మరికొన్ని సినిమాలు మనసులను మీటుతాయి. అలా… మనసులను మీటే చిత్రాలకున్న ప్రత్యేకత ఏమిటంటే… ఒక్కసారి చూసినా చాలు జీవితకాలం మధుర జ్ఞాపకాలుగా వెంటాడుతాయి. అలా వెంటాడే చిత్రాలలో లెజండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన గీతాంజలి ఒకటి.

`రూలర్`గా బాలకృష్ణ?
ఒకప్పుడు తెలుగు టైటిల్స్‌తోనే అలరించిన నందమూరి బాలకృష్ణ… ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ టైటిల్స్ పై ఫోకస్ పెడుతున్నారు. ‘లెజెండ్’, ‘లయన్’, ‘డిక్టేటర్’… వంటి ఇంగ్లీష్ టైటిల్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య. అంతేకాదు… తన అప్‌కమింగ్ మూవీకి కూడా ఇంగ్లీష్ టైటిల్‌నే ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ టాక్.

స్టూడెంట్ గా - సీఈవో గా- రైతుగా త్రీ- డైమన్షన్స్ ఉన్న పాత్రలో మహేష్ బాబు పర్ఫార్మెన్స్ సూపర్బ్
సినిమా మొత్తం మోస్ట్ ఎంజాయ్ బుల్ గా , ఇన్స్పిరేషనల్ గా అలరిస్తుంది "మహర్షి". మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో తన 25 వ చిత్రంగా ఇలాంటి సోషల్ రిలవెన్స్ ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ కంటెంట్ తో రావటం అభినందనీయం.

మహర్షి మూవీ తో కల్కి కమర్షియల్ ట్రైలర్
శివాని శివాత్మిక సమర్పణ లో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా కల్కి మూవీ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న కల్కి మూవీ లో అదా శర్మ, నందిత శ్వేత కథానాయికలు. 1983 సంవత్సరం నేపథ్యం లో రూపొందిన కల్కి మూవీ కి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. మే 9వ తేదీ రిలీజయిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ తో పాటు కల్కి మూవీ కమర్షియల్ ట్రైలర్ రిలీజయింది.
మన హీరోల 25 సినిమాల ల్యాండ్ మార్క్
ఒకప్పుడు ఒక హీరో ఒక ఏడాదికి మూడు నాలుగు సినిమా చేసేవారు. అంతకంటే ఎక్కువ సినిమాలు చేసేవారని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఆనాటి హీరోలు తమ సినీ కెరీర్ లో రెండు మూడొందలకు పైగా సినిమాలు తీసేవారు. అయితే అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా తీయడమే చాలా కష్టంగా మారింది. అప్పట్లో సెంచరీ చేయడం అనేది ఒక ల్యాండ్ మార్క్ గా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ మార్క్ కాస్తా 25 సినిమాలకు తగ్గింది. అంతేకాదు.. అప్పట్లో జయాపజయాలతో పని లేకుండా సినిమాలు తీసుకుంటూ వెళ్లేవారు. కానీ ఇప్పుడున్న హీరోలు.. ఒక ఫ్లాప్ వచ్చిందంటే చాలు.. మరో సినిమా చేయడానికి భయపడుతున్నారు. దీనికి…

జోరు పెంచిన యువ హీరోలు
టాలీవుడ్ లో నాని, నితిన్, నాగ చైతన్య, శర్వానంద్, వరుణ్ తేజ్, సుధీర్ బాబు, రానా, నాగ శౌర్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కార్తికేయవంటి యంగ్ హీరోలు ఉన్నారు. టాలీవుడ్ లో అగ్ర హీరో లు సంవత్సరానికి ఒక మూవీ మించి నటించడం లేదు. సీనియర్ దర్శకులు, యువ దర్శకులు యువ హీరోలతో సినిమాలు రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. టాలీవుడ్ లో యువ దర్శకులు తమ వయసుకు తగ్గట్టు కథలను రూపొందించడం తో యువ హీరోలు సంవత్సరానికి 2లేదా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
మే 9... కేరాఫ్ బ్లాక్ బస్టర్స్
మే 9… తెలుగు చిత్ర పరిశ్రమకి కలిసొచ్చిన తేదీ. గతంలో ఇదే తేదికి రిలీజైన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అంతేకాదు… కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీస్‌గా నిలిచాయి. ఆ జ్ఞాపకాల్లోకి వెళితే…

హిప్పీ మూవీ ట్రైలర్ విడుదల
V క్రియేషన్స్ బ్యానర్ పై TN కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ, దిగాంగన సూర్య వన్షి జంటగా తెలుగు తమిళ భాషలలో రూపొందిన హిప్పీ మూవీ జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ నటించిన హిప్పీ మూవీ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. నటుడు, దర్శకుడు JD చక్రవర్తి ఒక కీలక పాత్ర లో నటించిన హిప్పీ మూవీ కి నివాస్ K ప్రసన్న సంగీతం అందించారు.

‘దబాంగ్ 3’లో సౌత్ ఫ్లేవర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో పలు ఘనవిజయాలున్నాయి. వాటిలో… ‘గబ్బర్ సింగ్’(2012) ఒకటి. సల్మాన్ ఖాన్ హీరోగా హిందీనాట ఘన విజయం సాధించిన ‘దబాంగ్’(2010)కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. విశేషమేమిటంటే… ఈ రెండు వెర్షన్లు కూడా ఆ యా స్టార్ హీరోల వరుస పరాజయాలకు బ్రేక్ వేయడం విశేషం.

డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవికి హ్యాపీ బర్త్‌డే
“భానుమతి… ఒక్కటే పీస్” అంటూ ‘ఫిదా’లో సాయిపల్లవి చెప్పిన డైలాగ్… ఆమె సినీ కెరీర్‌కు చక్కగా సరిపోతుంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ బ్యూటీ… అనతికాలంలోనే దక్షిణాదిన నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.