స్పెష‌ల్ డేన రానున్న‌ ‘మన్మథుడు 2’?

Manmadhudu 2 To Release On A Special Day,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Latest Updates,Manmadhudu 2 Movie To Release on Nagarjuna Birthday,Manmadhudu 2 For Nagarjuna Birthday,Manmadhudu 2 - Nagarjuna Birthday Surprise Gift To His Fans
Manmadhudu 2 To Release On A Special Day

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన్మథుడు 2’. స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ అతిథి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. తాజాగా పోర్చుగల్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం… మే 21 నుంచి హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ను జ‌రుపుకోనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాని జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని గ‌త రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో… ఈ సినిమా విడుద‌ల‌కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన తేదీ వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే… నాగార్జున 60వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగస్టు 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంద‌ట‌. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

‘మన్మథుడు’కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండ‌గా… నాగార్జున‌, పి.కిర‌ణ్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

[subscribe]
[youtube_video videoid=rdma778BpC0 ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here