నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం అంతర్జాతీయ స్థాయిలో పాదయాత్ర చేసి వస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. విషయం పాజిటివ్ ఐనప్పటికీ
అది అవాస్తవం అయినప్పుడు విన్న వాళ్లకు, చదివిన వాళ్లకు చిర్రెత్తుకొస్తుంది. ఇప్పుడు అలాంటి అవాస్తవ ప్రచారం ఒకటి విపరీతంగా గా చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ విద్యారంగంలోకి ప్రవేశించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో
” చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్” ప్రారంభించబోతున్నారు అన్నదే ఆ వార్త. ఇది పక్కా ఫేక్ న్యూస్. అయితే అధికారిక వార్తను ప్రచురించినoత సాధికారికంగా ఈ ఫేక్ న్యూస్ ను ప్రచురించి ప్రచారం చేస్తున్నాయి కొన్ని మీడియా వర్గాలు. అసలు ఆ ప్రతిపాదనే లేని చిరంజీవి ఫ్యామిలీని పూర్తిస్థాయిలో ఇన్వాల్వ్ చేస్తూ కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ చానల్స్ చేస్తున్న హడావిడి చూస్తుంటే ఒక సెన్సేషనల్ న్యూస్ కోసం మీడియా ఎంత దిగజారుతుందో ….ఎలా తిమ్మినిబమ్మిని చేస్తుందో చూడండి. ఒక వార్త రాసేటప్పుడు పూర్తి సమాచారం దొరకకపోతే అనుకుంటున్నారట… తెలియవచ్చింది అని రాయవచ్చు. కానీ మొత్తం వార్తే ఒక అభూత కల్పన అయినప్పుడు ఆ కల్పనా చాతుర్యం ఎలా ఉంటుందో చూడండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* చిరంజీవి అభిమానులకు శుభవార్త
*విద్యా రంగంలోకి మెగా ఫ్యామిలీ
* మోహన్ బాబు కు పోటీగా
చిరంజీవి స్కూల్స్ స్థాపన
* అభిమానులకు డిస్కౌంట్
* జూన్ నుండి అడ్మిషన్స్
* శ్రీకాకుళం నుండి స్కూల్స్ ప్రారంభం
* చిరంజీవి హానరరీ ఫౌండర్
* నాగబాబు హానరరీ చైర్మన్
* స్వామినాయుడు హానరరీ కన్వీనర్
* ఉపాధ్యాయుల ఎంపిక
ఇంత సమాచారం ఇచ్చారు అంటే ఇది నిజంగా నిజమే అయ్యుంటుంది.. ఇదే నిజమైతే నిజంగా అది మెగా అభిమానులకు నిజమైన శుభవార్తే.
కాబట్టి దీనికి సంబంధించి మరిన్ని డిటేల్స్ తెలుసుకుందామని చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామి నాయుడుకు ఫోన్ చేస్తే “అదంతా అబద్ధమండీ … ఎవరో ఫ్యాన్స్ ఎక్కడో ఏదో స్కూల్ స్టార్ట్ చేసుకుంటే అది చిరంజీవి గారే స్వయంగా పెట్టారని పుట్టించారు… మీడియాలో ఒకరిని చూసి ఒకరు దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అందుకే సాయంత్రం లోపు నాగబాబుగారు దీనికి ఖండన ఇస్తున్నారు”- అని వివరణ ఇచ్చారు.
ఇలా ఉంటుంది ఇవాళ రేపు మీడియా ఓవరాక్షన్. ఇస్తున్న వార్త పాజిటివా? నెగిటివా అన్నది అట్లా ఉంచి అసలు వార్తలో నిజా నిజాలు ఎంత? అన్నది నిర్ధారించుకోవలసిన అవసరం ఉంది.
అదేమీ పట్టించుకోకుండా పూర్తిస్థాయి నిరాధార వార్తలతో పేజీలు నింపుకునే
స్థితికి మీడియా దిగజారితే నాశనం అయ్యేది “క్రెడిబిలిటీ”. నిజానికి ఈ వార్త వల్ల కొంపలు ఆరిపోయే నష్టాలు ఏమీ జరగవు. కానీ లాంగ్ రన్ లో విశ్వసనీయతను కోల్పోవటం అనే ప్రమాదం ఉంది.
[subscribe]
[youtube_video videoid=Q0WrJ6epCl4 ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: