కమర్షియల్ చిత్రానికి పర్‌ఫెక్ట్ నిర్వచనం ఇంద్ర – చిరంజీవి

Megastar Chiranjeevi Excited For Indra Grand Re-release on August 22nd

కమర్షియల్ చిత్రానికి పర్‌ఫెక్ట్ నిర్వచనం ‘ఇంద్ర’ సినిమా అని, అందులో నటీనటుల పెర్ఫార్మెన్స్ సహా కథ, డైలాగ్స్, సీన్స్, ఎమోషన్స్, మ్యూజిక్, సాంగ్స్, ఫైట్స్, ఫోటోగ్రఫీ.. ఇలా అన్నీ పీక్స్‌లో ఉంటాయని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన జన్మదినం సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంద్ర ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఇంద్ర సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడానికి గల కారణాలను వివరించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “ఇంద్ర.. ఇంద్రసేనారెడ్డి.. అని అంటూంటేనే వొళ్ళు గగుర్పొడుస్తుంది. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. దట్ ఈజ్ పవర్ ఆఫ్ ఇంద్ర.”

“ఇప్పటికీ ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారన్నా, అంత ప్రజాదరణ పొందిందన్నా అందుకు ప్రధాన కారణం కథ. ఏ సీన్ నుంచి మనం చూడటం మొదలుపెట్టినా చివరివరకు చూడకుండా ఉండలేం. అలా ఉంటుంది ఆ కథలోని పట్టు, బిగువు. నా సినిమాలలో అత్యున్నత సాంకేతిక విలువలున్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర. అందులో ఎలాంటి డౌట్ లేదు.”

“కమర్షియల్ చిత్రానికి పర్‌ఫెక్ట్ నిర్వచనం ఇంద్ర. ఈ సినిమా ఇంతటి ఉన్నత నిర్మాణ విలువలు కలిగివున్నాయంటే అందుకు కారణం, నా అభిమాన నిర్మాత, ఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్ గారు. అలాగే కథ అందించిన చిన్ని కృష్ణ, డైలాగ్స్ రాసిన పరుచూరి సోదరులు, ఇంకా అద్భుతమైన మ్యూజిక్ అందించిన స్వరబ్రహ్మ మణిశర్మ మరియు సినిమాటోగ్రఫర్ వీఎస్సార్ స్వామి తదితరులు.”

“లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. మా మంచి బాలుడు, గోపాలుడు (నవ్వుతూ).. దర్శకుడు బి.గోపాల్ గారు. అత్యత్భుతంగా చెక్కి, ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారకులు. వీరందరికీ నా కృతజ్ఞతలు. అలాంటి సినిమా మళ్ళీ 22 ఏళ్ల తరువాత 22న విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 2004 జూలై 24 నాడు ఎలాంటి భావోద్వేగంతో ఉన్నానో.. ఇప్పుడు కూడా అదే ఫీల్ ఉంది.”

“ఈ న్యూ జెనరేషన్ వారికి ఇంద్రను నా పుట్టిన రోజు కానుకగా బిగ్ స్క్రీన్ పైన చూపించడానికి సంకల్పించిన దత్ గారి పిల్లలు స్వప్న దత్ కి, ఆమె సోదరి ప్రియాంక దత్ కి ప్రత్యేకించి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చూడబోయే మీకు కూడా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ ఆల్” అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.