మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్‌తో దూసుకుపోతున్నారు నార్నె నితిన్. చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్, “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు, ఎమ్.సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంపద హీరోయిన్‌గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కైలాష్ మీనన్ సంగీతం, దాము నర్రావుల కెమెరా, మధు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ మేరకు దీనిపై తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. “మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి ఫీల్ గుడ్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీస్‌తో వరుస విజయాలు అందుకుంటున్నారు. వీటికి భిన్నంగా మా సినిమా వుంటుంది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతో తెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. ఎన్టీఆర్ ఎంతో మెచ్చి ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ దసరాకి నార్నె నితిన్ ఖాతాలో ఆయ్, మ్యాడ్ తరహాలో హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: