ఆయ్ టీమ్‌ను అభినందించిన ఐకాన్ స్టార్

Icon Star Allu Arjun Congratulated Aay Team on The Massive Success

మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న రిలీజైన ఈ ఫన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ప్రేక్ష‌కాద‌ర‌ణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినీ ప్రేక్షులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు సినీ సెల‌బ్రిటీలు సైతం ‘ఆయ్’ సినిమాను చూసి అద్భుత‌మంటూ చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. ఇప్ప‌టికే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా క‌లిసి విషెష్ అందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయ్ టీమ్‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలుసుకుంది. ఈ క్రమంలో మూవీ సూపర్ హిట్ అయినందుకు ఆయన చిత్ర బృందాన్ని అభినందించారు.

కాగా తొలి ఆట నుంచి మంచి మౌత్ టాక్ తో వరుసగా షోలు, స్క్రీన్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా చూసి ఓ చక్కని సినిమాను చూశామనే ఫీలింగ్‌తో జనాలు బయటకు వస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ ఆధారణపై చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. మొదటి రోజు అరవై లక్షల గ్రాస్ వస్తే.. నాలుగో రోజుకి 2.2కోట్ల గ్రాస్ వచ్చింది. తొలిరోజుతో పోల్చితే మూడు రెట్లు ఎక్కువగా వసూళ్లు వచ్చాయి. ఇలా రోజు రోజుకి సినిమా క‌లెక్ష‌న్స్ పెరుగుతుందంటే సినిమాకు ఉన్న ఆద‌ర‌ణేంటో అర్థం చేసుకోవ‌చ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.