టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించగా.. సంగీర్తన హీరోయిన్గా నటించింది. రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న గ్రాండ్ రిలీజ్ కానుంది. హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి ‘నా ఫేవరేట్ నా పెళ్లాం’ సాంగ్‌ను లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘సుహాస్‌కు ముందుగా హ్యాపీ బర్త్ డే. సుహాస్ కంటే ముందు చాలా మంది ఈ కథను విన్నారు. అందరూ ఎగ్జయిట్ అయ్యారు. కానీ అమ్మో! మేం చేస్తే ఎలా ఉంటుందో అని అన్నారు. ‘బలగం‘ రిలీజ్ తర్వాత నేనే ఓ రోజు సందీప్, హర్షిత్‌లను పిలిచాను. సుహాస్‌తో చేస్తే బావుంటుందని చెప్పాను. తనైతే కథతో రీచ్ అవుతాడనిపించిందన్నాను. వెంటనే వాళ్లు కూడా బావుంటుందన్నారు” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు వచ్చి ఆడుతున్నప్పుడు మాకొక కిక్ వస్తుంది. అలాంటి స్క్రిప్టే ఇది. మిడిల్ క్లాస్ అబ్బాయి.. తనకొచ్చే జీతంతో హ్యాపీగా ఉంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు వద్దనుకుంటాడు. ఎందుకు పిల్లలు వద్దనుకుంటున్నావని ఎవరైనా అడిగితే అందరికీ లెక్కలు చెప్పి నోరు మూయిస్తుంటాడు. ఈ రోజుల్లో ఉన్న జనరేషన్లో డబ్బులు అవసరమే, ఎమోషన్స్ కూడా అవసరమే” అని పేర్కొన్నారు.
“కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ సినిమాలను ప్రేక్షకులు ఎలాగైతే ఫ్రెష్‌గా ఫీలయ్యారో జనక అయితే గనక సినిమాను కూడా అలాగే ఫీల్ అవుతారు. సుహాస్, సంగీర్తన జంట ఆన్ స్క్రీన్ చక్కగా ఉంటుంది. లవ్ అంటే చాలా పాటలను మనం చూశాం. భార్య ప్రేమ గురించి గొప్పగా చెప్పటానికి సందీప్‌కు అవకాశం దక్కింది. దాన్నే ఈ సినిమాలో పాటగా రూపొందించారు. ప్రతీ భర్త తన భార్యకు డేడికేట్ చేయాల్సిన పాటే ‘నా ఫేవరేట్ నా పెళ్లాం’. సెప్టెంబర్ 7న ‘జనక అయితే గనక’ సినిమాతో మీ అందరి ముందుకొస్తాం’’ అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























