ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 67

భలే ఉన్నాడే ట్రైలర్ రిలీజ్

జనక అయితే గనక రిలీజ్ డేట్ ఫిక్స్

ఇమాన్వి క్రేజ్ మాములుగా లేదు

ఆకాష్ కొత్త సినిమా తల్వార్ ప్రారంభం

రామ్ తో సినిమా గురించి స్పందించిన హరీష్ శంకర్

కంగువాతో క్లాష్ కు దిగుతున్న వేట్టాయాన్

బ్రహ్మానందం మూవీ గ్లింప్స్ రిలీజ్

అల్లు అర్జున్ మా అన్నయ్య అని చెప్పే రోల్ చేశా

ఆయ్ టీమ్ తో మ్యాన్ ఆఫ్ మాస్

శివాజీ-లయ హిట్ కాంబినేషన్ రిపీట్

మెకానిక్ రాకీ డబ్బింగ్ ప్రారంభం

కార్తికేయ3 పై ఎగ్జైటింగ్ అప్ డేట్

క ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ది గోట్ ట్రైలర్ రిలీజ్
ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించగా.. ఆయన సరసన ఇంద్రజ కథానాయికగా కనిపించనున్నారు. అలాగే యువ నటులు అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో.. అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

వరల్డ్ ఫోటోగ్రఫీ డే.. అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్
ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన ఫొటోను పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన తన తండ్రి పాత ఫోటో ఒకటి షేర్ చేశారు. ఈ ఫొటోలో చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు బ్లాక్ గాగూల్స్ పెట్టుకుని సైకిల్ పట్టుకుని నిల్చుని ఉన్నారు. అయితే ఈ ఫోటోను చిరునే స్వయంగా తీయడం విశేషం.

భలే ఉన్నాడే ట్రైలర్ రిలీజ్
43రోజుల వ్యవధిలో మూడో సినిమాతో వస్తున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్.గత నెలలో పురుషోత్తముడు తో అలాగే ఈనెల స్టార్టింగ్ లో తిరగబడరసామీ అనే సినిమాలు వచ్చాయి.అయితే ఈరెండు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.ఇవి ఇంకా ఓటిటిల్లోకి కూడా రాలేదు అప్పుడే మరో సినిమాను దింపుతున్నాడు రాజ్ తరుణ్. అదే భలే ఉన్నాడే! ప్రముఖ డైరెక్టర్ మారుతి ప్రొడక్ట్ గా వస్తుంది దాంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

జనక అయితే గనక రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ టాలెంటెడ్ నటుల్లో సుహాస్ పేరు కూడా ముందుంటుంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే జనక అయితే గనక. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఈ సినిమాను తెరాకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఇమాన్వి క్రేజ్ మాములుగా లేదు
ఇమాన్వి ..ప్రస్తుతం ఈపేరు సోషల్ మీడియా లో మారుమోగుతోంది.దీనికి కారణం రెబల్ స్టార్ ప్రభాస్.ఒక్క సినిమా కూడా యాక్ట్ చేయకుండానే ఇమాన్వి, ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.అది పాన్ ఇండియా స్టార్ పక్కన అంటే మాములు విషయం కాదు.ఈసినిమా లాంచ్ కూడా అయిపొయింది.ఇమాన్వి కూడా లాంచ్ లో పాల్గొంది.దాంతో ఇమాన్వి పేరు మారుమోగుతోంది.

ఆకాష్ కొత్త సినిమా తల్వార్ ప్రారంభం
బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన ఆకాష్ పూరీ మెహబూబా సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత రొమాంటిక్, చోర్ బజార్.. సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఏ సినిమా కూడా మంచి హిట్ ను అందించలేకపోయాయి. ప్రస్తుతం అయి ఆకాష్ పూరీ పలు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే నేడు తన కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసింది.

రామ్ తో సినిమా గురించి స్పందించిన హరీష్ శంకర్
ఉస్తాద్ రామ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో సినిమా రానుందని రీసెంట్ గా వార్తలు వచ్చాయి.ఈనెల 15న ఈ ఇద్దరు తమ లేటెస్ట్ మూవీస్ తో వచ్చారు.అందులో భాగంగా హరీష్ డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ అలాగే రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అయ్యాయి.అయితే రిలీజ్ నెక్స్ట్ డే నుండి రామ్, హరీష్ శంకర్ కాంబో మరోసారి తెర మీదకు వచ్చింది.కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు.ఇక ఈ న్యూస్ గురించి హరీష్ శంకర్ ఎట్టకేలకు స్పందించాడు.

కంగువాతో క్లాష్ కు దిగుతున్న వేట్టాయాన్
సూపర్ స్టార్ రజినీకాంత్ ,సూర్య బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు.సూర్య కంగువా తో వస్తుండగా రజినీ వేట్టాయాన్ తోరానున్నాడు. కంగువా రిలీజ్ డేట్ ను చాలా రోజుల క్రితమే లాక్ చేశారు.రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అయితే సోలో రిలీజ్ కంఫర్మ్ అనుకున్న తరుణంలో అనూహ్యంగా వేట్టాయాన్ బరిలోకి దిగింది.ఈరోజే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.కంగువా దిగుతున్న రోజే అక్టోబర్ 10న ఈసినిమా కుడా వస్తుంది.

బ్రహ్మానందం మూవీ గ్లింప్స్ రిలీజ్
పల్లకిలో పెళ్లికూతురు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఆ తరువాత పలు సినిమాలు చేసినా కూడా మంచి విజయాన్ని అయితే దక్కించలేకపోయాయి. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాలో తండ్రి బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ముక్యంగా రియల్ లైఫ్‌లో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఈ సినిమాలో తాతామనవళ్లుగా నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

కన్నప్ప.. ముఖేష్ రిషి, బ్రహ్మాజీ క్యారెక్టర్స్ రివీల్
ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘భక్త కన్నప్ప’కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం.

అల్లు అర్జున్ మా అన్నయ్య అని చెప్పే రోల్ చేశా
ప్రముఖ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. ఆయన కుమారుడిగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అంకిత్ కొయ్య నటించాడు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు..

ఆయ్ టీమ్ తో మ్యాన్ ఆఫ్ మాస్
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నార్నే నితిన్. ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. ఇప్పుడు ఆయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంజి కే దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హాలీవుడ్‌తో పోటీపడే స్థాయిలో ప్రభాస్ - సీఎం రేవంత్ రెడ్డి
టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' తర్వాత దేశవ్యాప్తంగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో వరల్డ్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవలే 'కల్కి 28987 AD' చిత్రంతో రూ.1,000 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఎంతోమంది ఆయన నటనకు ఫిదా అవుతున్నారు.

జనక అయితే గనక నుండి నా ఫేవరెట్ నా పెళ్ళాం సాంగ్ రిలీజ్
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. హీరోగా ఏదో ఒక సినిమా కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈఏడాది ఇప్పటికే అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో జనక అయితే గనక అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. టైటిల్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

శివాజీ-లయ హిట్ కాంబినేషన్ రిపీట్
ప్రముఖ నటుడు శివాజీ మళ్ళీ సినిమాలలో బిజీ అవుతున్నారు. గత బిగ్ బాస్ సీజన్ 7లో ప్రధాన కంటెస్టెంట్‍గా శివాజీ మంచి గుర్తింపు సాధించాడు. అనంతరం ఆయన ప్రధానపాత్రలో నటించిన '90's' వెబ్ సిరీస్‌లో నటించి హిట్ అందుకున్నారు. తాజాగా ఆయన, ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ హీరోహీరోయిన్లుగా ఓ సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.2గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి నిర్మాత కూడా శివాజీ కావడం గమనార్హం.

మెకానిక్ రాకీ డబ్బింగ్ ప్రారంభం
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్నాడు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. మరో స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా నటిస్తోంది.

కార్తికేయ3 పై ఎగ్జైటింగ్ అప్ డేట్
చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన సినిమా కార్తికేయ2 ఎంత సంచలన విజయం సాధించిందో చూశాం. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ద్వారక నేపథ్యంలో కృష్ణుని కంకణం కథాంశం ఆధారంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకుంది. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు నార్త్ అడియెన్స్‌కు కూడా నచ్చేసింది. నచ్చడమే కాదు నార్త్ లో కూడా తన సత్తా చాటి సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం
కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

క ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
రాజావారు రాణిగారుతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరసగా రెండు సక్సెస్ ల చూసిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత నిరాశపరిచాడు.గత ఏడాది అయితే మూడు సినిమాలతో రాగ ఇందులో వినరో భాగ్యము విష్ణు కథ మాత్రమే డీసెంట్ హిట్ అనిపించుకుంది.మిగిలిన రెండు సినిమాలు మీటర్,రూల్స్ రంజన్ నిరాశపరచడంతో లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు.అయితే వరస ప్లాప్ లు తగలడంతో ఈసారి రూట్ మార్చాడు కిరణ్ అబ్బవరం.

ది గోట్ ట్రైలర్ రిలీజ్
ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.ఇక ఎట్టకేలకు ఈరోజు ట్రైలర్ ను విడుదలచేశారు.ఈ ట్రైలర్ సినిమా అంచనాలకు తగ్గట్లే వుంది.యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ లో విజువల్స్,స్టంట్స్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర.