ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఓజీ గురించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ మేరకు చిత్ర నిర్మాత డివివి దానయ్య దీనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈరోజు ‘సరిపోదా శనివారం’ సినిమాకు సంబంధించి మీడియాతో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించగా.. అందులో భాగంగా దానయ్య ఓజీ గురించి కూడా మాట్లాడారు. పవర్ స్టార్ నటిస్తోన్న ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుందని ఈ సందర్భంగా తెలిపారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ ముగించి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని వారు కోరుతున్నారు.
కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే కిక్ శ్యామ్, వెంకట్ బచ్చు, అజయ్ ఘోష్, మొట్ట రాజేందర్, జీవా, హరీష్ ఉత్తమన్, శాన్ కక్కర్, అభిమన్యు సింగ్, కుమనన్ సేతురామన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: