కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 110

Good Bad Ugly First Schedule wrapped up
షూటింగ్ అప్‌డేట్

గుడ్ బ్యాడ్ అగ్లీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

తమిళ హీరో తల అజిత్-మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అద్విక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈరోజుతో పూర్తయింది.హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన ఈ షెడ్యూల్ లో ఫైట్ సీక్వెన్స్ తోపాటు ఇంట్రో సాంగ్ ను షూట్ చేశారు. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. రీసెంట్ గా విడుదలైన అజిత్ ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో ప్రేమలు హీరో నస్లేన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.

TFN Adminవాట్సాప్
naga chaitanya thandel movie shooting new schedule update
షూటింగ్ అప్‌డేట్

తండేల్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా తండేల్. అనుకోని పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ బోర్డర్ లోకి ఎంటర్ అయి అక్కడ రెండేళ్లపాటు జైలు శిక్షను అనుభవించి బయటకు వచ్చిన గణగల్ల రామరావు జీవితాన్ని ఆధారం చేసుకొని ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
interesting facts about Legendary Media Entrepreneur ramoji rao
సినిమా వార్తలు

రామోజీరావు జీవిత ప్రస్థానం

ప్రతిరోజూ ఎంతోమంది జన్మిస్తుంటారు.. మరణిస్తుంటారు. అయితే మరణించినా కానీ చరిత్రలో తమ పేరు గుర్తుండిపోయేలా ఉండేవారు మాత్రం అతికొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో మీడియా మొఘల్ రామోజీరావు కూడా ఉంటారు. రామోజీ రావు అంటే మనకు గుర్తొచ్చేది ఈనాడు. కానీ ఆయన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇంతటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. అలాంటి మహా మనిషి నేడు ఉదయం ఆయన మృతి చెందటం ఎంతోమందిని శోకసంద్రంలో నెట్టేసింది. ఈనేపథ్యంలో 88 ఏళ్ల రామోజీరావు ప్రస్థానం ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
Ramoji Rao Passed Away The Film Producers Council Announced Bandh For Film Shootings on Sunday
షూటింగ్ అప్‌డేట్

రామోజీ రావు మృతికి సంతాపంగా.. రేపు చిత్ర పరిశ్రమ బంద్

తెలుగు మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. హృదయ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్‌ సిటీలోని స్వగుర్హనికి తరలించి అభిమానుల సందర్శనార్ధం ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడికి వెళ్లి రామోజీరావుకు నివాళులర్పిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Legendary Media Entrepreneur and Famous Business Personality Ramoji Rao's Life History
సినిమా వార్తలు

మీడియా మొఘల్ రామోజీ రావు జీవిత విశేషాలు

మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. హృదయ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు రామోజీ ఈ వేకువ జామున మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించి సందర్శకుల దర్శనార్ధం ఏర్పాట్లు చేశారు. కాగా రామోజీరావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

TFN Adminవాట్సాప్
Vishnu Manchu Announced Kannappa Teaser Release Date
ట్రైలర్ & టీజర్

కన్నప్ప టీజర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

చాలా గ్యాప్ తరువాత విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్త కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. సినిమా షూటింగ్ ను ఎక్కువభాగం విదేశాల్లోనే పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే కొంతమేరకు సినిమా షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది.

TFN Adminవాట్సాప్
Charming Star Sharwanand Praises Chandrababu, Balakrishna and Pawan Kalyan
సినిమా వార్తలు

మనమే వస్తామని చెప్పి మరీ గెలిచారు - శర్వానంద్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ 'మనమే' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్‌లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Actress Shalini and Shamlee Special Throwback Still with Megastar Chiranjeevi Goes Viral
సినిమా వార్తలు

మెగాస్టార్‌తో షాలిని, షామిలి త్రో బ్యాక్ పిక్, నెట్టింట వైరల్

ఇండియాలో కోలీవుడ్‌ స్టార్ హీరో అజిత్ కుమార్ అంటే తెలియని వారే ఉండరు. అలాగే ఆయన సతీమణి, నటి షాలిని కూడా సినీప్రియులకు చిరపరిచితమే. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటోను పోస్ట్ చేయగా అది నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీనికి ప్రత్యేక కారణం.. ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన త్రోబ్యాక్ పిక్. కాగా షాలిని తన సోదరి షామిలి మరియు సోదరుడు, నటుడు అయిన రిచర్డ్‌ రిషితో కలిసి చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా వీరు దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
TFI Star Directors Congratulated Nandamuri Balakrishna For Winning Hat-trick as MLA
సినిమా వార్తలు

బాలకృష్ణకు అభినందనలు తెలిపిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్

తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ అత్యధిక స్థానాలు (164) కైవసం చేసుకుని అధికారం పీఠం దక్కించుకుంది. ఈ కూటమిలో టీడీపీతో పాటుగా బీజేపీ, జనసేన పార్టీలు కూడా భాగమే అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో టీడీపీ తరపున హిందూపురం నియోజకవర్గం నుంచి టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ పోటీచేసి గెలుపొందిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
cine celebrities deep condolences to ramoji rao
సినిమా వార్తలు

మీడియా మొగల్ కు సినీ ప్రముఖుల ఘన నివాళులు

ఈ ఏడాది మరో దిగ్గజం దివికేగింది. మీడియో మొగల్, ఈటీవీ అధినేత, ప్రముఖ నిర్మాత రామోజీ రావు నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున మరణించారు. ఇక రామోజీ రావు మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేస్తున్నారు.దీంతో రాజకీయ, సినిమా, పారిశ్రామిక రంగాలు విషాదంలో మునిగిపోయాయి. రామోజీరావు మరణంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Mohan Babu Condolences To Ramoji Rao
సినిమా వార్తలు

రామోజీ రావు గారు మన మధ్య లేరు అంటే నమ్మలేకపోతున్నా - మోహన్ బాబు

మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. హృదయ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు రామోజీ ఈ వేకువ జామున మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. కాగా రామోజీరావు మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు రామోజీ మృతిపై…

TFN Adminవాట్సాప్
Game Changer Team To Pay Tribute To Ramoji Rao
సినిమా వార్తలు

రామోజీ రావు మృతి.. ‘గేమ్ ఛేంజర్’ టీమ్ సంతాపం

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీరావు అస్తమించారు. హృదయ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు రామోజీ ఈ వేకువ జామున మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. కాగా రామోజీరావు మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ramoji rao deserves bharat ratna says rajamouli
సినిమా వార్తలు

రామోజీకి భార‌త‌ర‌త్న ఇవ్వాలి-రాజమౌళి

మీడియో మొగల్ రామోజీరావు నేడు మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. గత కద్దిరోజులుగా అనారోగ్యంతో భాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఉంచగా.. ఇక కడసారి ఆయన పార్థీవదేహాన్ని చూసేందుకు వెండితెర, బుల్లితెర ప్రముఖులతో పాటు, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా అక్కడికి వస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Icon Star Allu Arjun Mourns on Ramoji Raos Demise
సినిమా వార్తలు

రామోజీ రావు కన్నుమూత.. సంతాపం తెలిపిన అల్లు అర్జున్

తెలుగునాట దిగ్గజ మీడియా అధిపతి, ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు రామోజీ ఈ వేకువ జామున మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. కాగా ప్రస్తుతం రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. కాగా రామోజీరావు మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
8 Vasantalu Telugu Movie First Look Poster
ఫస్ట్ లుక్

మైత్రీ 8 వసంతాలు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

చాలా తక్కవ కాలంలో మంచి పేరును సంపాదించుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. తీసిన సినిమాలన్నీ హిట్టవ్వడం.. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం.. వరుస పెట్టి సినిమాలు తీస్తుండటంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ బ్యానర్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇక ఒకవైపు పెద్ద పెద్ద సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న సినిమాలను సైతం ఎంకరేజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ బ్యానర్ నుండి మరో సినిమా వస్తుంది.

TFN Adminవాట్సాప్
Eenadu Group Companies Chairman Ramoji Rao Passed Away
సినిమా వార్తలు

మీడియా దిగ్గజం, పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయం

తెలుగు మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీరావు అస్తమించారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తగా కుటుంబసభ్యులు హుటాహుటిన నానక్‌రామ్‌గూడలోని స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం వైద్యులు గుండెకు స్టెంట్ వేశారు.

TFN Adminవాట్సాప్
harom hara makers unveil guns the war making video
సినిమా వార్తలు

హరోం హర గన్స్ అండ్ వార్ మేకింగ్ వీడియో రిలీజ్

జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హరోం హర. పలు వాయిదాల అనంతరం ఈసినిమా ఫైనల్ గా జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేయగా అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పలు అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేయడానికి చూస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు. గన్స్ అండ్ వార్ మేకింగ్ వీడియో అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీడియోలో ఈసినిమా…

TFN Adminవాట్సాప్
Vedaa Releasing on 15th August
సినిమా వార్తలు

పుష్ప 2 కి పోటీ గా వస్తున్న వేదా

తెలుగులోనే కాదు నేషన్ వైడ్ గా భారీ అంచనాలున్న సినిమా పుష్ప 2. ఫస్ట్ పార్ట్ పుష్ప నార్త్ లో 100కోట్లకు పైగా రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.దాంతో సీక్వెల్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. రీసెంట్ గా రిలీజైనా రెండు పాటలకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పుష్ప 2 ఆగస్టు 15న విడుదలకానుందని తెలిసిందే. తెలుగులో అయితే ఈసినిమాకు పోటీ గా మరో సినిమాను దించే సాహసం చేయడం లేదు అయితే హిందీ లో మాత్రం ఓ సినిమా ఎదురు వెళ్తుంది అదే వేదా.

TFN Adminవాట్సాప్
amaran release date locked
రిలీజ్ అప్‌డేట్

అమరన్ రిలీజ్ డేట్ లాక్

ఈఏడాది ప్రారంభంలో అయలాన్ తో వచ్చిన తమిళ హీరో శివ కార్తికేయన్ రీసెంట్ గా అమరన్ సినిమాను కంప్లీట్ చేశాడు. ఇందులో అతను ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్న ఈసినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Ram Charan is headed to Rajahmundry for game changer shooting
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్ కోసం రాజమండ్రికి రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ ఫైనల్ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ఈ రోజు సాయంత్రం రాజమండ్రి చేరుకున్నాడు. దాదాపు వారం రోజులపాటు అక్కడ ఈ షెడ్యూల్ జరుగనుంది. దీంతో రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కానుంది.ఈ షెడ్యూల్ తరువాత ఇంకో లాంగ్ షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండనుంది. అందులో మిగితా నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఆ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ కానుంది.సెప్టెంబర్ లోపు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి అక్టోబర్ లేదా డిసెంబర్ లో సినిమాను విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్