మైత్రీ 8 వసంతాలు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

8 Vasantalu Telugu Movie First Look Poster

చాలా తక్కవ కాలంలో మంచి పేరును సంపాదించుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. తీసిన సినిమాలన్నీ హిట్టవ్వడం.. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం.. వరుస పెట్టి సినిమాలు తీస్తుండటంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ బ్యానర్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇక ఒకవైపు పెద్ద పెద్ద సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న సినిమాలను సైతం ఎంకరేజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ బ్యానర్ నుండి మరో సినిమా వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో 8 వసంతాలు అనే టైటిల్ తో ఒక సినిమా వస్తుంది. లేడీ ఒరియెంటెడ్ గా ఈసినిమా రానుంది. ఈసినిమాలో అనంతిక స‌నిల్ కుమార్ హీరోయిన్ గా నటిస్తుంది. మ్యాడ్ సినిమాతో అనంతిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇప్పుడు తాజాగా అనంతిక ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. శుద్ది అయోధ్య అనే పాత్రలో నటిస్తుంది అనంతిక. పోస్ట‌ర్‌ లో ఆమె క‌దిలే క‌విత్వం అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.