ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీరావు అస్తమించారు. హృదయ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు రామోజీ ఈ వేకువ జామున మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. కాగా రామోజీరావు మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా రామోజీరావు మృతిపై స్పందిస్తున్నారు. దీనిలో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ టీమ్ రామోజీ మృతికి సంతాపం తెలిపింది. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్, నటులు సునీల్, రఘు తదితరులు రామోజీ రావుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కొద్దిసేపు మౌనం పాటించగా.. ఇందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
Team #GameChanger pays tribute to the legendary #RamojiRao garu with a moment of silence 🙏🏻
The way you paved countless paths with your vision has defined today’s cinema ❤️ You will always be a source of hope and inspiration 🙏🏻
Rest in Peace sir! pic.twitter.com/Aas2MYMW4c
— Sri Venkateswara Creations (@SVC_official) June 8, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: