నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా తండేల్. అనుకోని పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ బోర్డర్ లోకి ఎంటర్ అయి అక్కడ రెండేళ్లపాటు జైలు శిక్షను అనుభవించి బయటకు వచ్చిన గణగల్ల రామరావు జీవితాన్ని ఆధారం చేసుకొని ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఒక అప్ డేట్ అయితే బయటకు వచ్చింది. ఈసినిమా నెక్ట్స్ షెడ్యూల్ జూన్ 10వ తేదీ నుండి రామోజీ ఫిలిం సిటీలో జరపనున్నట్టు తెలుస్తుంది. అక్కడ కొన్ని రోజులు షూటింగ్ చేసిన అనంతరం శ్రీకాకుళంకు షిప్ట్ అవ్వనున్నట్టు సమాచారం.
కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: