ఇండియాలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అంటే తెలియని వారే ఉండరు. అలాగే ఆయన సతీమణి, నటి షాలిని కూడా సినీప్రియులకు చిరపరిచితమే. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటోను పోస్ట్ చేయగా అది నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీనికి ప్రత్యేక కారణం.. ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన త్రోబ్యాక్ పిక్. కాగా షాలిని తన సోదరి షామిలి మరియు సోదరుడు, నటుడు అయిన రిచర్డ్ రిషితో కలిసి చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా వీరు దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇది ఇంతలా వైరల్ కావడానికి కారణం ఉంది. అదేంటంటే..? 1990లో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం గుర్తుండే వుంటుంది. ఈ ఫోటోలో ఉన్నవారంతా ఈ చిత్రంలో నటించడం విశేషం. షాలిని, షామిలి, రిషి నాడు బాల నటులుగా నటించారు. ఈ నేపథ్యంలో సుమారు 34 ఏళ్ల తర్వాత మళ్ళీ వీరంతా కలుసుకుని ఆనాటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు.
View this post on Instagram
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. ‘నా సామి రంగ’ ఫేమ్ ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























