తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ అత్యధిక స్థానాలు (164) కైవసం చేసుకుని అధికారం పీఠం దక్కించుకుంది. ఈ కూటమిలో టీడీపీతో పాటుగా బీజేపీ, జనసేన పార్టీలు కూడా భాగమే అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో టీడీపీ తరపున హిందూపురం నియోజకవర్గం నుంచి టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ పోటీచేసి గెలుపొందిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా బాలకృష్ణ హిందూపురం నుంచి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ తదితరులు నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లోని బాలకృష్ణ నివాసానికి వెళ్లిన వారు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ సోషల్ మీడియాలో బాలయ్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన అందులో.. “ఎమ్మెల్యేగా తిరుగులేని హ్యాట్రిక్ సాధించినందుకు మన ప్రియతమ హీరో నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు. మీ విజయ పరంపర ప్రజలకు మీ పట్ల మరియు మీ సేవల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం” అని పేర్కొన్నారు.
Hearty congratulations to our dearest hero #NBK Garu for scoring an unstoppable hat-trick as MLA. Your winning streak is a testament to the people’s love for you and your services. 💐❤️ pic.twitter.com/uCclt1Z1kT
— Bobby (@dirbobby) June 7, 2024
ఇక మరోవైపు ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ రికార్డు విజయం నమోదుచేసింది. మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు మరియు 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయగా.. 100 శాతం సక్సెస్ రేటుతో అన్నింటిలో విజయదుందుభి మ్రోగించింది. ఇలా ఒక పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడం దేశవ్యాప్తంగా ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఆ పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నియోజకవర్గంలో బరిలో నిలిచి 70 వేలకు పైగా భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: