టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్‌సే స్టూడియోస్ ప్రొడక్షన్‌లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ‘మనమే’ నేడు (శుక్రవారం,జూన్ 7) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయింది. ఈ క్రమంలో మేకర్స్ అంతకుముందు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ శర్వానంద్‌కు ‘ఛార్మింగ్ స్టార్’ టైటిల్ ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన స్పెషల్ వీడియోను ఈవెంట్‍లో ప్రజెంట్ చేశారు. గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేష్, కిషోర్ తిరుమల అతిధులుగా పాల్గొన్నారు.
ఇక ఈవెంట్‍లో శర్వానంద్ మాట్లాడుతూ.. “స్వామి శరణం. అందరికీ నమస్కారం. ముందుగా మనమే వస్తామని చెప్పి ముచ్చటగా నాలుగో సారి సీఎం అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హార్టీ కంగ్రాజులేషన్స్. చాలా సంతోషంగా వుంది. ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేశాయి. ఒక పండగ వాతావరణం స్టార్ట్ అయ్యింది” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “జూన్ 7న మనమే అంటూ మరో పండగ స్టార్ట్ అవుతోంది. దాని తర్వాత 27 కల్కి. మరో పండగ వాతావరణం. ఇక నుంచి అన్ని మంచి రోజులే. ఇక మనమే సక్సెస్ ఫంక్షన్ పిఠాపురంలో చేయాలని అనుకున్నాం. కానీ పర్మిషన్ దొరకలేదు. విశ్వ గారు ప్లాన్ చేస్తే సక్సెస్ పార్టీ ఫస్ట్ అక్కడ చేస్తాం. సినిమా సక్సెస్ పార్టీ పిఠాపురంలో జరగాలని నా కోరిక. సక్సెస్ కొట్టిన తర్వాత పిఠాపురంలో కలుస్తాం” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: